నాకు గర్భం వస్తే ఆబార్షన్ చేయించాడు.. ఆధారాలు, ఫోటోలను బయట పెట్టిన హీరో లవర్
యువనటుడు రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం టాలీవుడ్‌లో దుమారం రేపుతోంది. తనతో 11 ఏళ్ల పాటు సహజీవనం చేసి మరో అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడంటూ రాజ్‌తరుణ్‌పై హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్న సినీనటి మాల్వీ మల్హోత్రా , ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని.. రాజ్ తరుణ్ లైఫ్‌లోంచి వెళ్లకపోతే చంపుతామని వార్నింగ్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్‌తరుణ్‌ని వదిలేస్తే కొంత డబ్బు ఇస్తామని, లేదంటే చంపేస్తామని మాల్వీ ఆమె సోదరుడు బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించింది.
హిమాచల్ ప్రదేశ్ సీఎం తన తండ్రికి క్లోజ్ ఫ్రెండ్ అనీ.. తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని నన్ను వారిద్దరూ బెదిరించారని లావణ్య ఆరోపించింది. మాల్వీ ట్రాప్‌లో పడి రాజ్ తరుణ్ తనకు దూరంగా ఉంటున్నాడని.. ఆయన లేకపోతే తాను ఉండలేనని తేల్చిచెప్పింది. అయితే ఫిర్యాదులో ఆరోపించిన అంశాలపై తగిన ఆధారాలు కావాలని లావణ్యకు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అటు రాజ్ తరుణ్ సైతం లావణ్య తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తనకు క్లోజ్ ఫ్రెండ్ అని.. తనతో కలిసి నటించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. అయినా ముంబైలో ఉండే ఆమెకు, హైదరాబాద్‌లో ఉండే తనకు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఎలా సాధ్యమవుతుందని రాజ్ తరుణ్ ప్రశ్నించారు. 2017 వరకు మాత్రమే లావణ్య నేను శారీరకంగా, మానసికంగా రిలేషన్‌లో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు. కానీ తర్వాత తను డ్రగ్ అడిక్ట్ అయ్యిందని, చెడు స్నేహాలు చేస్తోందని దీంతో ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయమన్నానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్‌ను దక్కించుకోవడానికే ఈ కేసు పెట్టి.. తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని రాజ్ తరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను లేనిదే బతకనని చెబుతున్న ఆమె మస్తాన్ అనే వ్యక్తితో ఎందుకు డేటింగ్ చేస్తోందని ఆయన నిలదీశారు.
మరోవైపు తనపై లావణ్య చేస్తున్న ఆరోపణలపై మాల్వీ మల్హోత్రా సైతం స్పందించారు. రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన ప్రతి హీరోయిన్‌ను లావణ్య వేధిస్తోందని.. అలాగే తనకు కూడా మెసేజ్‌లు, కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని మాల్వీ ఆరోపించారు. రాజ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. గడిచిన 6 నెలలుగా ఆయనతో కనీసం మాట్లాడింది కూడా లేదన్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న లావణ్యపై తానే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. తన కుటుంబం నుంచి ఎవరూ లావణ్యను బెదిరించడం లేదని.. ఆమె తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని మాల్వీ మల్హోత్రా ఆరోపించారు.

అయితే లావణ్య మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. రాజ్‌తరుణ్‌పై రోజుకొక ఆరోపణ చేస్తూనే ఉంది. అతనికి చాలా మంది అమ్మాయిలతో అఫైర్లు ఉన్నాయని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెబుతోంది. త్వరలోనే అన్ని ఆధారాలను బయటపెడతానని లావణ్య అంటోంది. తాజాగా రాజ్‌తరుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో తనకు పదేళ్ల కిందటే పెళ్లయ్యిందని.. అప్పటి నుంచి తాము కాపురం చేస్తున్నామని లావణ్య తెలిపారు. లావణ్య అలియాస్ అన్విక పేరుతో కలిసే ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు కూడా వెళ్లామని ఆమె చెప్పారు.
ఈ క్రమంలో తాను గర్భం దాల్చడంతో రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని, దీనికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్‌ను పోలీసులకు అందించానని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మాల్వీ ఎంట్రీ ఇచ్చాక రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు లావణ్య దాదాపు 170 ఫోటోలు, సాంకేతిక ఆధారాలను పోలీసులకు సమర్పించింది. వీటి ఆధారంగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజా ఆరోపణలపై రాజ్‌తరుణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











