ఉపాసన బాటలోనే మెగా కొత్త కోడలు.. లావణ్య త్రిపాఠి ఏం పని చేసిందో మీరే చూడండి!
లావణ్య త్రిపాఠి.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 2012లో అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె మొదటి సినిమాతోనే హిట్టు కొట్టింది. ఆ తర్వాత కూడా అనేక అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా కనిపించి లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అయితే 2017లో మిస్టర్ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోకలిసి నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరోసారి అంతరిక్ష సినిమా కోసం కలిశారు. అయితే ఆ సినిమా చేస్తుండగానే వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా మెల్లిమెల్లిగా ప్రేమగా మారింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమా హిట్టుగా నిలవడం.. వీరిద్దరి మధ్య బంధం కూడా బలపడడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ కొంత కాలం పాటు ఆగాలనుకున్నారు. ఈక్రమంలోనే చాలా ఏళ్ల పాటు గుట్టుగా ప్రేమాయణం సాగించిన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు.. ఇరు కుటుంబ సభ్యులకు ఈ విషంయ చెప్పారు. వాళ్లు కూడా వీరి పెళ్లికి ఒప్పుకోగా.. నవంబర్ ఒకటో తేదీన ఇటలీలో గ్రాండ్ గా వీవరి వివాహం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటైన ఈ జంట.. ఆ తర్వాత హైదరబాద్ కు వచ్చి గ్రాండ్ గా రిసిప్షన్ కూడా ఇచ్చారు.

అయితే పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ లో బిజీ కాగా.. లావణ్య మాత్రం ప్రస్తుతం పెళ్లి లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి రెండో కోడలుగా వెళ్లిన ఆమె.. తాజాగా ఓ మంచి పని చేసింది. ముఖ్యంగా తన పెద్దమామ అయిన గాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కొణిదెలను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. తోటి కోడలు నడిచిన బాటలోనే నడుస్తూ.. మెగా ఫ్యామిలీ పరువు, ప్రతిష్ఠలను మరో స్థాయికి తీసుకెళ్లబోతుంది.

ముఖ్యంగా తన అక్క ఉపాసన కామినేని కొణిదెల మాదిరిగానే.. లావణ్య త్రిపాఠి తన పేరును మార్చుకుంది. ఓ వైపు తల్లిదండ్రుల ఇంటి పేరు ఉంచుకుంటూనే భర్త ఇంటి పేరును తన పేరులో కలిపేసుకుంది. అచ్చం ఉపాసన కామినేని కొణిదెల లాగానే.. లావణ్య త్రిపాఠఇ కొణిదెల గా మారిపోయింది. సోషల్ మీడియా అకౌంట్లు అయిన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వాటిల్లో తన పేరును ఇలా మార్చేసుకుంది లావణ్య. ఈ విషయం గుర్తించిన నెటిజెన్లు అంతా లావణ్య చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











