Raj Tarun : రాజ్ తరుణ్ తల్లిదండ్రుల్ని గెంటేసిన లావణ్య .. ఆ ఇల్లు నా బిడ్డ కష్టం, హీరో తల్లి కంటతడి

గతేడాది యువ హీరో రాజ్ తరుణ్ - లావణ్యల వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించడం మధ్యలోకి రకరకాల పేర్లు తెర మీదకి రావడం దుమారం రేపింది. తనను దూరం పెడుతూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపించింది. తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే దగ్గరుండి అబార్షన్ చేయించాడని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. సద్దుమణిగిందని అనుకున్న ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

రాజ్‌ను వదిలేయాలని, లేనిపక్షంలో అంతు చూస్తామని మాల్వీ , ఆమె సోదరుడు తనకు వార్నింగ్ ఇచ్చారని గతంలో లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్, ఫోటోలను పోలీసులకు అందజేసింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతుండగానే రాజ్ తరుణ్ - లావణ్య ఇష్యూలో పలువురు తెరపైకి వచ్చారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ భాషా, ప్రీతి, మస్తాన్ సాయి వంటి వారు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

lavanya thrown raj tarun parents RJ Shekar Basha protest at hero house

శేఖర్ భాషా అయితే ఈ ఇష్యూలో కాస్త సీరియస్‌గానే జోక్యం చేసుకున్నాడు. అయితే ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో అతనిపై లావణ్య చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ కేసుల రాజ్‌తరుణ్‌ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇటీవల మస్తాన్ సాయి వ్యవహారంతో మరోసారి లావణ్య, రాజ్ తరుణ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఏకంగా శేఖర్ భాషాను లేపేద్దామంటూ లావణ్య- ఆమె స్నేహితురాలు పడాల లక్ష్మీ అనే యువతి మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వెనుక జరుగుతున్న కుట్రను శేఖర్ భాషా బయటపెట్టాడు. తనపై ఓ ఇంట్లో కుట్ర జరుగుతోందని.. లావణ్, పడాల లక్ష్మీలు ఒకేచోట ఉంటారని తెలిపాడు. వరలక్ష్మీ టిఫిన్స్ వ్యవహారంలో తప్పించుకోవడానికి మస్తాన్‌పై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించాడు. రాజ్ తరుణ్‌ని వదిలేసిన తర్వాత మెయింటైన్స్ కోసం కొన్నాళ్లు చింటూపై లావణ్య ఆధారపడిందని, అనంతరం మస్తాన్ సాయిని ట్రాప్ చేసిందని శేఖర్ భాషా ఆరోపించాడు.

తాజాగా రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఆమె ఇంట్లో నుంచి గెంటేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కోకాపేటలోని రాజ్ తరుణ్‌కు చెందిన విల్లాలోకి ఆయన తల్లిదండ్రులు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య.. వారిని ఇంట్లో నుంచి గెంటేసింది. దీంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ బిడ్డ ఎంతో కష్టపడి ఈ ఇల్లు కొన్నాడని.. ఇందులో లావణ్యకు ఎలాంటి హక్కులు లేవని, ఇది తమదేనని చెబుతున్నారు.

రాజ్ - లావణ్య మూడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారని.. తర్వాత విడిపోయారని వారు తెలిపారు. చికిత్స కోసం తాము బయటికి వెళ్లగా.. ఇప్పుడు ఇంటికొస్తే మమ్మల్ని గెంటేసిందని వారు వాపోతున్నారు. అయితే లావణ్య మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తోంది.. రాజ్ తరుణ్ పేరెంట్స్ 15 మందితో తన మీదకు వచ్చారని చెబుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Read more about: raj tarun lavanya shekar basha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X