లావణ్య త్రిపాఠికి తప్పిన ప్రమాదం.. చాలా భయమేసిందంటూ కామెంట్
యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రమాదం అంచులదాకా వెళ్లి బయటపడిందట. పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొని ఉపరిరి పీల్చుకుందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ సమావేశంలో వెల్లడించింది. ఈ మేరకు ప్రమాదం తాలూకు వివరాలు చెప్పింది లావణ్య.
ఇటీవలే నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వచ్చిన 'అర్జున్ సురవరం' సినిమాతో మరోసారి తెరపైకి వచ్చింది లావణ్య త్రిపాఠి. నవంబర్ 29వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు తప్పిన ప్రమాదంపై స్పందించింది.

'అర్జున్ సురవరం' సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు జరిగిన ఘటనపై మాట్లాడింది లావణ్య. సినిమాలో కారు ఛేజింగ్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు తనకు తృటిలో ప్రమాదం తప్పిందని ఆమె చెప్పుకొచ్చింది. కొంచెంలో కారులో నుంచి బయటకు పడేదాన్ని తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ ఘటన జరిగిన రోజు చాలా భయమేసిందని, ఇంటికెళ్లిన తర్వాత అదే విషయం గుర్తొచ్చిం నిద్ర కూడా సరిగా పట్టలేదని ఆమె పేర్కొంది. అయినప్పటికీ తనకు యాక్షన్ చిత్రాలంటే చాలా ఇష్టం అంటోంది లావణ్య.
ఇక ఇటీవలే జరిగిన 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లావణ్య సొట్ట బుగ్గలపై కామెంట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చేస్తున్న ఈ కామెంట్స్ విని తెగ మురిసిపోయింది ఈ ముద్దుగుమ్మ. 'అర్జున్ సురవరం' హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఇక ఈమెకు వరుస అవకాశాలు వస్తాయా? అనేది చూడాలి మరి.


Click it and Unblock the Notifications











