వరుణ్ తేజ్ తో పెళ్లిపై లావణ్య త్రిపాఠి.. అప్పుడే జరిగేదంటూ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో లావణ్య త్రిపాఠి ఒకరు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ సీతా రామం డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన చేసిన లావణ్య త్రిపాఠీకి ఆ మధ్య విజయాలు వరించలేదు.
మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా దూసుకుపోతున్న లావణ్యపై మెగా వారసుడు వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్ హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో తాజాగా పెళ్లి వార్తలపై స్పందించింది ఈ సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి.

మార్షల్ విద్యాభ్యాసం తర్వాత..
ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తారాఖండ్ లోని డెహ్రడూన్ లో పెరిగింది. లావణ్య తండ్రి హైకోర్టు న్యాయవాది కాగా.. తల్లి ఉపాధ్యాయినిగా పదవి విరమణ చేశారు. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. మార్షల్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి ముంబైకి వెళ్లి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా సాధించింది.

తండ్రి కోరిక మేరకు..
చిన్నప్పటి నుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని కలలు కన్న లావణ్య త్రిపాఠి తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో, టీవీ కార్యాక్రమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం సైతం గెలుచుకుంది సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. అలా మోడలింగ్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా మారిన తొలి సినిమా అందాల రాక్షసితో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది.

మంచి విజయాలతో..
అందాల రాక్షసి సినిమాలో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంది. తన క్యూట్‌నెస్‌తో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి హిట్ కొట్టిన తర్వాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో అలరించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.

వరుణ్ తేజ్ ప్రపోజ్..
ఇక ఈ సినిమాల తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన ఏ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. లచ్చిందేవికి ఓ లెక్కుంది, రాధ, ఇంటలిజెంట్, యుద్ధం శరణం, మిస్టర్, అంతరిక్షం, అర్జున్ సురవరం, ఏ1 ఏక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే వంటి చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. అయితే ఇటీవల వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ ఎక్కువైన విషయం తెలిసిందే. లావణ్య ఇంటికి వెళ్లి మరి వరుణ్ తేజ్ ప్రపోజ్ చేశాడని టాక్ వినిపించింది.

స్ట్రాంగ్ ఆన్సర్..
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు హిట్టు కాలేదు గానీ వీళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రం పెరిగింది అని కామెంట్స్ వినిపించాయి. ఇక వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్ పై నెటిజన్లు అడగ్గా వాళ్లకు స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. దీంతో ఆ రూమర్స్ కాస్తా తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా తనపై వస్తున్న పెళ్లి వార్తలపై రియాక్ట్ అయింది ఈ బ్యూటి.

అప్పుడే పెళ్లి జరుగుతుంది..
వరుణ్ తేజ్ తో వస్తున్న వార్తలపై అతని పేరు ఎత్తకుండా ఆన్సర్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. "నా పెళ్లి విషయంలో నా తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయడం లేదు. కాబట్టి నేను కూడాపెళ్లి గురించి ఆలోచించడం లేదు. పెళ్లికి సంబంధించి నేను ఏం కలలు కనడం లేదు. ప్రస్తుతం నా మొత్తం దృష్టి అంతా సినిమాలపైనే ఉంది.
కానీ వివాహం మీద నాకు నమ్మకం ఉంది. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి జరుగుతుంది. అయినా పెళ్లి అనేది నా పర్సనల్ లైఫ్ కు సంబంధించింది. కాబట్టి నా పర్సనల్ విషయాల గురించి బయటకు చెప్పడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు" అని చెప్పుకొచ్చింది క్యూట్ భామ లావణ్య త్రిపాఠి.


Click it and Unblock the Notifications











