సొట్టబుగ్గల బ్యూటీకి మహేశ్ బంపర్ ఆఫర్: టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న హీరోయిన్

ఈ మధ్య కాలంలోనే 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీద ఉన్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. హ్యాట్రిక్ విజయాలు సొంతం అవడంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రాన్ని మొదలు పెట్టిన ఈ హ్యాండ్సమ్ హీరో.. అది షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళితో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఇది మొదలెట్టక ముందే మరో చిత్రానికి కూడా సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.

మిగిలిన హీరోలందరూ వరుస పెట్టి ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు లైన్‌లో పెట్టుకుంటుండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా అదే స్పీడుతో దూసుకెళ్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనికి ఇంకా చాలా సమయం పట్టేటట్లు ఉంది. అయినప్పటికీ కొద్ది రోజుల క్రితమే ఈ స్టార్ హీరో.. టాలీవుడ్ బడా డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు. ఊహించని విధంగా సెట్ అయిన ఈ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి.

Lavanya Tripathi Fix for Mahesh Babu Movie

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేయబోయే సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి తరచూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్తే బయటకు వస్తోంది. ఇక, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్ వెర్షన్‌ను కూడా పూర్తి చేసుకున్న త్రివిక్రమ్.. కాస్టింగ్ మీద దృష్టి సారించాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో నటించేందుకు గానూ బుట్టబొమ్మ పూజా హెగ్డేను లీడ్ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక, ఇప్పుడు మరో బ్యూటీని కూడా ఇందులో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

త్రివిక్రమ్ తెరకెక్కించే చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండడం సర్వసాధారణమే. ఇందులో భాగంగానే మహేశ్ బాబుతో చేసే సినిమాలో పూజా హెగ్డేతో పాటు మరో భామను కూడా తీసుకుంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నభా నటేష్, మీనాక్షి చౌదరి వంటి వాళ్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, తాజాగా మరో ఊహించని హీరోయిన్ పేరు వెలుగులోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం లావణ్య త్రిపాఠిని తీసుకుంటున్నారట. ఇప్పటికే ఆ చర్చలు కూడా ముగిశాయని టాక్. దీంతో ఈ బ్యూటీ పేరు ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ చేస్తున్నారు. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ చివరి నుంచి జరిగే అవకాశాలు ఉన్నాయని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X