ఆ హీరోతో మ్యారేజ్.. పెళ్లి వార్తలపై స్పందించిన లావణ్య త్రిపాఠి

Happy birthday మూవీలో తొలిసారి యాక్షన్ సినిమా చేస్తున్నాను. గన్స్ పట్టుకోవడం, ఫైట్స్ చేయడం కొత్తగా అనిపించాయి. నాకు గన్స్ అంటే ఇష్టం. ఈ సినిమాలో నా పేరు హ్యాపీ. 24 గంటల్లో జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కింది. లాక్‌డౌన్ తర్వాత నాకు ఆప్షన్లు వచ్చాయి. అయితే క్యారెక్టర్‌లో ఫ్రెష్‌నెస్ ఉందని ఒప్పుకొన్నది. కామిక్ పాత్రలు ఇప్పటి వరకు చేయలేదు. నేను ఫన్ గర్ల్. నేను నా ఫ్రెండ్స్‌తో కామిక్‌గా ఉంటాను అని లావణ్య త్రిపాఠి అన్నారు. హ్యాపీ బర్త్ డే సినిమా గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ..

పదేళ్ల తర్వాత నాకు లీడ్ రోల్

పదేళ్ల తర్వాత నాకు లీడ్ రోల్


హీరోయిన్‌‌కు టైటిల్ రోల్ రావడం కష్టం. అయితే నా అదృష్టం కొద్ది నా తొలి సినిమా అందాల రాక్షసి మూవీలో కూడా నేనే లీడ్‌గా ఉన్నాను. మళ్లీ పదేళ్లకు నేను ఒక సినిమాను లీడ్‌గా నడిపించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఇంటర్వ్యూలో నా రియల్ క్యారెక్టర్ చూసి ఈ సినిమాలోని రోల్ ఇచ్చారు. ఈ సినిమాలోని హ్యాపీ పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది అని లావణ్య త్రిపాఠి చెప్పారు.

 నాకు ఛాలెంజ్ అనిపించిన రోల్ ఏమిటంటే?

నాకు ఛాలెంజ్ అనిపించిన రోల్ ఏమిటంటే?


నా పదేళ్ల కెరీర్‌లో నాకు బాగా ఛాలెంజ్ అనిపించిన చిత్రం అందాల రాక్షసిలోని మిథున క్యారెక్టర్. ఆ సినిమా తర్వాత నటించిన ప్రతీ పాత్ర నాకు చాలా సులభంగా అనిపించాయి. పెద్దగా ఛాలెంజ్ అనిపించిన పాత్రలు నా ముందుకు రాలేదు. మళ్లీ హ్యాపీ పాత్ర అలాంటి అనుభూతిని కలిగించింది అని లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు.

నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని..

నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని..


నా టాలెంట్‌, నా ఫెర్ఫార్మెన్స్ బట్టి చూస్తే.. నేను స్టార్ హీరోయిన్ అనే బిగ్ లీగ్‌లో లేకపోయాను. కానీ నా ప్రతిభకు తగినట్టు నేను రాణించాను. పదేళ్లు ఇండస్ట్రీలో ఉన్నానంటే.. లావణ్య టాలెంట్ తెలిసిపోతుంది. అందరికి నంబర్ స్థానంలో ఉండాలని కోరుకొంటారు. నేను కూడా కోరుకొంటాను. కానీ ఏదో లోపం వల్ల నాకు రావాల్సిన క్రేజ్ రాలేకపోయింది. కానీ చావుకబురు చల్లగా లాంటి ఎమోషనల్ పాత్రలు నాకు సంతృప్తిని కలిగించాయి అని లావణ్య త్రిపాఠి చెప్పారు.

హీరోతో పెళ్లి వార్తలు నిజం కాదు..

హీరోతో పెళ్లి వార్తలు నిజం కాదు..


ఒక హీరోను నేను పెళ్లి చేసుకొన్నాననే వార్తలు నిజం కాదు. నాకు పెళ్లి జరుగలేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకోను. నేను నా సినిమాల షూటింగ్ బిజీలతో ఉన్నాను. నాపై చాలా ఒత్తిడి ఉంది. నేను ఆ ఒత్తిడి తొలగించుకొనేందుకు నేను పర్వతారోహణ, ఔటింగ్, వెకేషన్స్‌కు వెళ్తుంటాను. పెళ్లి చేసుకొనే సమయం ఇచ్చినప్పుడు తప్పకుండా చేసుకోవాల్సిందే అని లావణ్య త్రిపాఠి తెలిపారు.

 రాజమౌళి రావడం చాలా హ్యాపీ

రాజమౌళి రావడం చాలా హ్యాపీ


మీ మొదటి సినిమా దర్శకధీరుడు రాజమౌళి ప్రజంట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కి ఆయన మళ్ళీ వచ్చారు. ఆయన రావడం చాలా ఆనందంగా అనిపించింది. రాజమౌళి రావడం వల్ల టీమ్ అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీ నింపారు. హ్యాపీ బర్త్ డే సర్రియల్ ప్రపంచంలో జరుగుతుంది. ఆ ప్రపంచానికి ఎలాంటి హద్దులు వుండవు. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న వుండదు. ఎందుకంటే అది ఊహజనితం. హ్యాపీ బర్త్ డేలో ఇది యునిక్ గా ఉంటుంది అని లావణ్య త్రిపాఠి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X