తల్లి కాబోతున్న మెగా కోడలు.. గుడ్ న్యూస్ చెప్పిన మెగా హీరో!

మెగాస్టార్ చిరంజీవి రెండో సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా రాణిస్తున్నారు. ప్రేమకథలు, మాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది మట్కా అనే పీరియాడికల్ సినిమాతో వచ్చిన వరుణ్ తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఆయన తన సహ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్ తేజ్.

మిస్టర్‌లో కలిసి నటించిన వరుణ్ - లావణ్య

2014లో ముకుంద చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు వరుణ్ తేజ్. ఆ తర్వా కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం 9000 కేఎంపీహెచ్, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్, గనీ, ఎఫ్ 3, గాండీవధారి అర్జున, మట్కా చిత్రాల్లో నటించారు వరుణ్. 2017లో మిస్టర్ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి నటించారు వరుణ్ తేజ్. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ సినిమాలోనూ మరోసారి జోడీగా నటించారు వరుణ్ - లావణ్య.

lavanya tripathi and varun tej Konidela announce pregnancy

మెగా కాంపౌండ్‌తో క్లోజ్‌గా లావణ్య

వరుణ్ తేజ్ - లావణ్య మధ్య ఏదో నడుస్తోందని మీడియా కోడై కూసింది. మెగా కాంపౌండ్‌లో లావణ్య త్రిపాఠి ఎక్కుగా కనిపిస్తుండటం.. మెగా - అల్లు కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా పాల్గొనడంతో ఈ అనుమానాలకు తావిచ్చింది. ఇద్దరూ ఈ గాసిప్స్‌పై మౌనంగానే ఉన్నారు. అయితే ఓ రోజున తమ రిలేషన్‌పై మౌనం వీడారు వరుణ్ - లావణ్య. అనంతరం పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. 2023 జూన్ 8న హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో వరుణ్ - లావణ్యల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది.

ఇటలీలో వరుణ్ - లావణ్యల వెడ్డింగ్

ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత నుంచి వీరి పెళ్లెప్పుడు? ఇండియాలోనా? ఫారిన్‌లోనా? పెళ్లికి ఎవరెవరు వస్తున్నారు వంటి వార్తలు వినిపించాయి. నిశ్చితార్ధం జరిగిన దాదాపు 5 నెలల తర్వాత 2023 నవంబర్ 1న ఇటలీలో వరుణ్ - లావణ్యల వివాహం జరగనుందని నాగబాబు ప్రకటించారు. ఇటలీలోని టుస్కానీలో హిందూ ఆచారం ప్రకారం ఈ జంట పెళ్లి జరిగింది. వరుణ్ - లావణ్యల పెళ్లికి మెగా, అల్లు కుటుంబాలతో పాటు లావణ్య ఫ్యామిలీ, అతికొద్దిమంది సన్నిహితులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

పెళ్లి తర్వాత షూటింగ్స్‌కి లావణ్య

పెళ్లయిన్ తర్వాత మెగా కోడలిగా హుందాగా వ్యవహరిస్తున్నారు లావణ్య త్రిపాఠి. కుటుంబ సభ్యులతో కలిసి వరుణ్ - లావణ్యలు జరుపుకున్న పండుగలు, వాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. పలు కార్యక్రమాల్లో లావణ్య త్రిపాఠి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచేవారు. పెళ్లి తర్వాత పలు వెబ్ సిరీస్‌లలో షూటింగ్స్‌లో పాల్గొన్నారు లావణ్య. సతీ లీలావతి, థనల్ వంటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన లావణ్య మళ్లీ బ్రేక్ ఇచ్చారు.

పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించిన మెగా కపుల్

పెళ్లైన నాటి నుంచి వీరిద్దరూ ఎప్పుడు శుభవార్త చెబుతారా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారని పలుమార్లు మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీ వీటిని ఖండించేది. ఈ నేపథ్యంలో ఈ సస్పెన్స్‌కు తెరదించారు లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ దంపతులు. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చిన్నారి షూతో చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను వరుణ్, లావణ్యలు షేర్ చేశారు. మెగా ఫ్యామిలీలోకి మరో చిన్నారి అడుగుపెట్టనుండటంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు.

More from Filmibeat

Read more about: lavanya tripathi varun tej
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X