twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో షారుక్ అవుతాడనుకొంటే అర్ధాంతరంగా.. సుశాంత్‌ ఫ్యామిలీకి కేంద్ర మంత్రి ఓదార్పు

    |

    యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం తర్వాత సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు శ్రద్దాంజలి ఘటిస్తూ సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పాట్నాలోని యువ హీరో నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుశాంత్ ఫోటోకు దండవేసి కేంద్ర మంత్రి రవి శంకర్ శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్బంగా సుశాంత్ ఫ్యామిలీతో తన అభిప్రాయాలను, అనుభూతులను పంచుకొన్నారు. రవి శంకర్ ఏమన్నారంటే..

    సుశాంత్ మా పాట్నా వాడు..

    సుశాంత్ మా పాట్నా వాడు..

    సుశాంత్ మరణ వార్త తెలియగానే.. రవి శంకర్ ప్రసాద్ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఆయన మరణం నాకు తీవ్ర దిగ్రాంతిని కలిగించింది. నేను, సుశాంత్ పాట్నాకు చెందిన వారం. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నన్ను కలిసి మాట్లాడారు. పాట్నాకు చెందిన వాడినని నాతో చెప్పారు. కానీ ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తారని ఊహించలేదు అంటూ రవిశంకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఎంతో సాధిస్తారుకొన్నాను..

    ఎంతో సాధిస్తారుకొన్నాను..

    సుశాంత్ సింగ్ ఇంటికి వెళ్లిన తర్వాత రవి శంకర్ ప్రసాద్ వెల్లడిస్తూ.. పాట్నాలోని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశాను. వారికి నా ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేశాను. ప్రతిభావంతుడైన నటుడి జీవితానికి ఇలా అర్ధాంతరంగా ముగింపు లభించడం బాధకరం. ఎంతో సాధిస్తారని అనుకొంటే.. మధ్యలోనే జీవితాన్ని చాలించాడు. తన టాలెంట్‌కు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది అని రవి శంకర్ తన సంతాపంలో పేర్కొన్నారు.

    షారుక్ ఖాన్ అంత ఎత్తుకు

    షారుక్ ఖాన్ అంత ఎత్తుకు

    తాజాగా పాట్నాలో కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత సంతాప లేఖను రాశారు. డియర్ సుశాంత్ నీవు ఇలా మమల్ని వదిలిపోవడం చాలా బాధకరం. భవిష్యత్‌లో నీవు షారుక్ ఖాన్ అంత ఎత్తుకు ఎదుగుతావని అనుకొన్నాను అని ఇప్పుడే నీ తండ్రి, చెల్లెలుకు చెబుతున్నాను. బాధను దిగమింగుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం చాలా విషాదానికి గురిచేసింది అని రవిశంకర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput: Paani సహా 7 Movies నుంచి ప్లాన్ ప్రకారం Sushant ని తొలగించారు
    పాట్నాలో కుటుంబ సభ్యులకు ఓదార్పు

    పాట్నాలో కుటుంబ సభ్యులకు ఓదార్పు

    ఇదిలా ఉండగా, జూన్ 15వ తేదీన సుశాంత్ అంత్యక్రియలను నిర్వహించిన కుటుంబ సభ్యులు గురువారం జూన్ 16న పాట్నాకు చేరుకొన్నారు. సుశాంత్ అస్థికలను జూన్ 17వ తేదీన నిమజ్జనం చేశారు. వారు పాట్నాలో ఉన్న సమయంలోనే కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ కుటుంబ సభ్యులను కలుసుకొని ఓదార్చారు.

    English summary
    Bollywood Sushant Singh Rajput committed suicide on June 14th. In this tragedy moments, Law Minister Ravi Shankar Prasad visited Sushant Singh Rajput's house in Patna to pay condolences to his family. He wrote his condolence letter that, I was just telling your father and sister, that I used to see future Shah Rukh Khan in you.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X