కమల్ హాసన్ పోస్టర్స్‌పై పేడ కొట్టిన లారెన్స్.. లోక నాయకుడి ఫ్యాన్స్ ఫైర్

దక్షిణాదిన రాఘవ లారెన్స్ అంటే తెలియని వారుండరు. దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, నిర్మాతగా ఇలా ప్రతీ ఒక్క క్రాఫ్ట్‌లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అంతేకాకుండా సామాజిక సేవలోనూ ముందుంటాడు. సామాజిక సమస్యలపై సినిమాలు తెరకెక్కించడమే కాకుండా.. సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు. వరుస సక్సెస్‌‌ల మీదున్న లారెన్స్.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. అక్షయ్ కుమార్ హీరోగా కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా దర్భార్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ.. వివాదాన్ని కొని తెచ్చుకున్నాడు.

 లారెన్స్ అతిథిగా..

లారెన్స్ అతిథిగా..

సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం దర్బార్. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ఆదివారం చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు లారెన్స్ హాజరయ్యాడు. రజనీకి వీరాభిమాని అయిన లారెన్స్.. తలైవా మీద తనకున్న అభిమానాన్ని చెప్పుకొస్తూ.. మరో అగ్రనటుడు కమల్‌ గురించి తక్కువ చేసినట్టు మాట్లాడాడు. ఇప్పుడదే వివాదంగా మారింది.

 కమల్ పోస్టర్ పేడ

కమల్ పోస్టర్ పేడ

‘చిన్నతనం నుంచి రజనీ అభిమాని.. చిన్నప్పుడు గోడ మీద కమల్ సార్ పోస్టర్ కనిపిస్తే ఆవుపేడ తీసి కొట్టేవాడ్ని. కానీ.. ఈ రోజున వీళ్లిద్దరూ చేయి.. చేయి కలుపుకొని నడుస్తుంటే చూసేందుకు చాలా సంతోషంగా ఉంద'ని చెప్పుకొచ్చాడు.

వివాదంగా మారిన స్పీచ్..

వివాదంగా మారిన స్పీచ్..

లారెన్స్ స్పీచ్ మొత్తాన్ని వదిలేసి.. సరిగ్గా పేడ సీన్ వరకూ కట్ చేసిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పెట్టేయటంతో రచ్చ మొదలైంది. దీంతో లోక నాయకుడి అభిమానులు లారెన్స్‌పై ఫైర్ అవుతున్నారు. మా నాయకుడి మీద అలాంటి కామెంట్లు చేస్తావా? అంటూ ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు. దీంతో.. తల పట్టుకోవటం లారెన్స్ వంతైంది.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
వివరణ ఇచ్చిన లారెన్స్..

వివరణ ఇచ్చిన లారెన్స్..

దీంతో.. సమస్యను గుర్తించిన లారెన్స్ సోషల్ మీడియా ద్వారా భారీ వివరణ ఇచ్చుకున్నాడు. ‘కమల్ సార్ పోస్టర్ మీద తాను పేడ కొట్టిన వైనంపై ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.. నన్ను అలా అనే ముందు వీడియో మొత్తం చూడండి. చిన్నతనంలో చేసిన పని చెప్పానే కానీ.. నాకు కమల్ సార్ అంటే గౌరవం. అయినా ఆయనపై ఉన్న గౌరవాన్ని, ప్రేమను నిరూపించుకోవాల్సినా అవసరం లేదు. మీకు ఇంకా అనుమానం ఉంటే.. ఆ వీడియోను పూర్తిగా చూడండి' అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X