సూపర్ స్టార్‌తో లారెన్స్.. గురువే శరణం అంటూ ట్వీట్

సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రజినీ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన రేంజ్ ఏపాటిదో అందరికీ అర్థమవుతుంది. ఆరు పదుల వయసు దాటిన రజినీ.. అలుపెరుగుకుండా విరామం అనేది లేకుండా వరుప ప్రాజెక్ట్‌లతో బిజీగా గడిపేస్తున్నాడు. అలాంటి రజినీ ఓ అభిమాని కోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని వెచ్చించాడట. ఇక ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా ఉంటాయి కదా. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇంతకీ ఆ అభిమాని ఎవరా? అని అంటే.. దర్శకుడు, నిర్మాత, నృత్య దర్శకుడు, హీరో అయిన లారెన్స్.

ఈ మధ్య రాఘవ లారెన్స్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. దర్బార్ ఆడియో వేడుకలో రజినీపై ఉన్న అభిమానాన్ని చాటి చెబుతూ తన చిన్నతనంలో చేసిన చేష్టల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో కమల్ పోస్టర్‌లపై ఆవు పేడ వేసేవాడ్ని అని చెప్పడం, ఆ వ్యాఖ్యలకు కమల్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం, దీనికి లారెన్స్ వివరణ ఇచ్చుకోవడం మనం చూశాం. చివరకు లోక నాయకుడిని కలిసి అంత వివరంగాచెప్పి ఆయనతో ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు లారెన్స్.

 Lawrence Meet Rajinikanth In Hyderabad

తనకు కమల్ అంటే ఎంతో గౌరవమని, ఆ విషయాన్ని ఆయనకు వివరంగా చెప్పానని బహిరంగంగా తెలిపాడు. తాజాగా సూపర్ స్టార్‌పై ఉన్న ప్రేమను మరోసారి చూపించాడు. నేడు దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్న కారణంగా రజినీ ఇక్కడికి విచ్చేశాడు. ఈ క్రమంలో రజినీని లారెన్స్ కలిసి, నూతన సంవత్సరం సందర్భంగా ఆశీర్వచనాలు తీసుకోవడానికి వచ్చానని, గురువే శరణం అంటూ, తనతో సమయాన్ని గడిపినందుకు ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X