ఎన్టీఆర్ బయోపిక్‌కు వర్మ కౌంటర్.. మహానాయకుడు రిలీజ్ రోజే లక్ష్మీస్ ఎన్టీఆర్..
ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగం మహానాయకుడు ఫిబ్రవరి 22వ తేదీన విడుదలకు సిద్దమవుతున్నది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్‌ను టార్గెట్ చేస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో కార్యక్రమం రోజున వర్మ తాను రూపొందించే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మహానాయకుడు రిలీజ్ రోజున తన సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించగానే వర్మ తన సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తానని ట్వీట్ చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్‌ను ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం 9.27 గంటలకు రిలీజ్ చేస్తున్నాం. మహానాయకుడు రిలీజ్ అయ్యే రోజున అంటే ఫిబ్రవరి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. ఎవరైతే మహానాయకుడు సినిమాను చూడటానికి వస్తారో వారు లక్ష్మీస్ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా చూడవచ్చు అని ట్వీట్‌లో వర్మ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











