'లక్ష్మీబాంబ్' ట్రైలర్.. ఆకట్టుకున్న అక్షయ్
ఏడాదికి ఐదు నుంచి ఏడు సినిమాలు చేసే ఏకైక హీరో అక్షయ్ కుమార్. చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు ఎంచుకుంటూ మంచి విజయం సాగిస్తుంటాడు. ఇదే అక్షయ్ టాప్ హీరోగా నిలబడటానికి కారణం అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటె, సౌత్ లో మంచి విజయం సాధించిన 'కాంచన' సినిమాను బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే.
'లక్ష్మి బాంబ్' పేరుతో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ వేగంగా ఇటీవలే పూర్తయ్యింది. లక్ష్మి బాంబ్ లో అక్షయ్ కుమార్ లేడీ గెటప్ కు సంబంధించిన ఫోటోను ఆ మధ్య రిలీజ్ చేశారు. పాత్రకు తగ్గట్టుగా అక్షయ్ కుమార్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.

ట్రైలర్ చూస్తుంటే కథలో ఎలాంటి మార్పు లేదని అర్ధమవుతుంది. ఇక తన నటనతో కామెడీ తో అక్షయ్ అదరగొట్టబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. అక్షయ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది . ఇక ఈ సినిమాను నవంబర్ 9న డిస్నీ హాట్ స్టార్ లో విడుదలకానుంది.


Click it and Unblock the Notifications











