నితిన్ మూవీతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ.. ఏ రోల్ చేస్తుందో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభంలో వరుసగా హిట్లు కొట్టిన అతడు.. చాలా కాలం పాటు ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. అయితే, మధ్యలో కొన్ని సక్సెస్‌లను అందుకున్నా.. ఈ మధ్య కాలంలో మరోసారి వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు.
నితిన్ గత ఏడాది 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాతో వచ్చాడు. కానీ, ఇది కూడా అతడికి విజయాన్ని అందించలేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న కసితో 'రాబిన్‌హుడ్' మూవీని స్టార్ట్ చేశాడు. ఇది షూటింగ్ జరుగుతుండగానే ఇప్పుడు 'వకీల్ సాబ్' ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

వేణు శ్రీరామ్ - నితిన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'తమ్ముడు' మూవీకి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీనికి ఏమాత్రం బ్రేకులు లేకుండా చిత్రీకరణ జరుపుతూనే ఉన్నారు. ఇందులో హీరో నితిన్‌తో పాటు చాలా మంది ప్రముఖులు భాగం అవుతున్నారు. త్వరలోనే దీన్ని పూర్తి చేసేలా ప్లాన్లు చేసుకుంటున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'తమ్ముడు' మూవీని సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో ఫ్యామిలీ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇందులో హీరో నితిన్‌కు సోదరిగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌ను తీసుకుంటున్నారని అంటున్నారు. ఇందుకోసం ఎంతో మంది పేర్లను సైతం పరిశీలించారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'తమ్ముడు' మూవీలో నితిన్ సోదరిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ నటిస్తుందట. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా భాగం అయ్యారని తెలిసింది. ఇందులో నితిన్ - లయ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయని అంటున్నారు. మొత్తానికి లయ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారన్న మాట.
ఇదిలా ఉండగా.. యూత్ స్టార్ నితిన్ - వేణు శ్రీరామ్ కాంబోలో వస్తున్న 'తమ్ముడు' మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో సప్తమీ గౌడ హీరోయిన్‌గా, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











