Pankaj Udhas: 72 ఏళ్ల వయసులో పద్మశ్రీ అవార్డు గ్రహిత కన్నమూత.. పంకజ్ ఉదాస్ మృతికి కారణం ఏంటంటే?

ఈ మధ్య కాలంలో సినీ రంగంలో వరుసగా విషాధాలు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని సినీ రంగాల్లో అనేక మంది సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటికి నిన్న బాలీవుడ్ కు చెందిన ఓ టాప్ డైరెక్టర్ కుమార్ సహానీ, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ వీ మహేష్ లు కన్నుమూశారు. తాజాగా మరో లెజెండరీ సింగర్ ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. అయితే ఈ సింగర్ పేరేంటి ఆయన వివరాలు ఏంటి, ఎలా చనిపోయారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సుప్రసిద్ధ గజల్ గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత.. పంకజ్ ఉదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నోన్నో అద్భుతమైన పాటలను పాడి.. శ్రోతలను ఉర్రూతలూగించిన ఈయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈక్రమంలోనే ఆయన సోమవారం రోజు ఉదయం.. ప్రాణాలు కోల్పోయాడు. 72 ఏళ్ల వయసులో పంకజ్ ఉదాస్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినట్లు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ తెలిపారు.

Leendary Gazhal Singer And Padma Sri Award Winner Pankaj Udhas Passed Away Check Details

ముంబై పట్టణంలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఉదయం 11 గంటల ప్రాంతంలో మరణించినట్లు స్పష్టం చేశారు. అలాగే మంగళవారం రోజు ఉదయం పంకజ్ ఉదాస్ అంత్యక్రియలు జరగబోతున్నట్లు వెల్లడించారు. పంకజ్‌కు భార్య ఫరీదా ఉదాస్, కుమార్తెలు నయాబ్, రీవా ఉదాస్ లు ఉన్నారు. అలాగే పంకజ్ సోదరులు... నిర్మల్ మరియు మనహర్ ఉదాస్ లు ఉన్నారు. వీరు కూడా గాయకులే.

1951 మే 17వ తేదీన పుట్టిన పంకజ్ ఉదాస్.. అద్భుతమైన సింగర్ గా పేరు తెచ్చుకున్నాడు. హిందీ సినిమాలతో పాటు ఇండియన్ పాప్ లో తన రచనలకు గాను విపరీతమైన గుర్తింపు వచ్చింది. పంకజ్ ఉధాస్ 1980లో ఆహత్ అనే గజల్ ఆల్బమ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1981లో ముకరర్, 1982లో తర్రన్నమ్, 1983లో మెహ్‌ఫిల్, 1984లో పంకజ్ ఉదాస్ లైవ్ ఎట్ రాయల్ ఆల్బర్ట్ హాల్, 1985లో నయాబ్ వంటి అనేక హిట్‌లను రికార్డ్ చేశాడు.

Leendary Gazhal Singer And Padma Sri Award Winner Pankaj Udhas Passed Away Check Details

ఆయన టాలెంట్ ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును అందించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు తాన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈయన 72 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయవడంతో.. సినీ రంగం అంతా దుంఖంలో మునిగిపోయింది. పంకజ్ ఉదాస్ మృతికి సంతాపం తెలుపుతూ అనేక మంది ట్వీట్లు చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు అంతా ధైర్యంగా ఉండాలని చెప్పుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X