లెజెండరీ హీరోయిన్ బీ సరోజా కన్నుమూత.. విషాదంలో దక్షిణాది సినీ పరిశ్రమ

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ రంగాల్లో అద్బుతమైన అభినయంతో ఆకట్టుకొన్న అలనాటి స్టార్ హీరోయిన్ బీ సరోజా దేవీ ఒక లేరు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ బెంగళూరులో సోమవారం ఆమె కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. ఆమె మరణంతో దక్షిణాది సినిమా పరిశ్రమలో ఓ లెజెండరీ నటి శకం ముగిసింది. ఆమె మరణ వార్తతో దక్షిణాది సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆమె మృతి వార్తను జీర్ణించుకోలేక సన్నిహితులు, స్నేహితులు, సినీ వర్గాలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆమె మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. లెజెండరీ యాక్టర్ జీవిత విశేషాల వివరాల్లోకి వెళితే..

అప్పటి మైసూర్ స్టేట్ ప్రస్తుత బెంగళూరులో బీ సరోజా దేవీ జనవరి 7వ తేదీ 1938 సంవత్సరంలో వక్కలింగ ఫ్యామిలీలో జన్మించారు. ఆమె తండ్రి భైరప్ప పోలీస్ ఆఫీసర్. తల్లి రుద్రమ్మ గృహిణి. భైరప్ప, రుద్రమ్మ దంపతులకు నాలుగో సంతానం. చిన్నతనంలోనే నృత్యాలతో ప్రతిభ చాటడంతో తల్లిదండ్రులు ఆమెను నటనారంగంపై ఆసక్తిని పెంచేలా చేశారు. ఆమెకు తన 17వ ఏటనే మహాకవి కాళిదాస సినిమాతో భారీ సక్సెస్ దక్కింది. ఆ తర్వాత పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి 1957లో అడుగుపెట్టారు. ఆ తర్వాత నాడోడి మన్నన్ సినిమా ద్వారా 1958లో తమిళ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.1959లో పైగా అనే సినిమా ద్వారా హిందీ రంగంలోకి ప్రవేశించారు.

B Saroja Devi

బీ సరోజా దేవీ సుమారుగా 3 దశాబ్దాలపాటు సినిమా రంగంలో అద్బుతమైన ప్రతిభను చాటుకొన్నారు. ఆమె సుమారుగా 161 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ పూజ, పెళ్లి సందడి, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేక వీరుడి కథ, శ్రీ సీతారామ కల్యాణం, మంచి చెడు, శ్రీ కృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, అమరశిల్పి జక్కన్న, ప్రమీలార్జునీయం, సీతారామ వనవాసం, దానవీర శూర కర్ణ లాంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో 2005 సంవత్సరంలో ఆమె నటించిన చివరి చిత్రం దేవీ అభయం.

భారతీయ సినిమా పరిశ్రమకు సరోజా దేవీ చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 1969 సంవత్సరంలో పద్మ శ్రీ అవార్డు, 1992లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. బెంగళూరు యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం కలైమమాని అనే అవార్డును ప్రధానం చేశారు. ఆమెను అభిమానులు, సినీ వర్గాలు అభినయ సరస్వతి, కన్నడథు పైంగ్లీ అనే బిరుదులతో పిలుచుకొంటారు.

బీ సరోజా దేవీ 1967 సంవత్సరంలో శ్రీ హర్ష అనే ఇంజినీర్‌ను వివాహం చేసుకొన్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె నటించే విధంగా భర్త సహకారం అందించారు. భువనేశ్వరి అనే అమ్మాయిని దత్తత తీసుకొన్నారు. తన కూతురు చిన్న వయసులోనే మరణించడం ఆమెను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తన కూతురు పిల్లలు ఇంద్ర, గౌతమ్ అనే మనవడు, మనవరాళ్లు ఉన్నారు. ఆనారోగ్య కారణాలతో భర్త శ్రీ హర్ష 1986లో మరణించారు.

భారతీయ సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు చేసిన సరోజా దేవీకి ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి.2001,2009 లోనే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, 2009 లో డాక్టర్ రాజ్‌కుమార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు, కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు అందుకొన్నారు. 1994 సంవత్సరంలో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది.

More from Filmibeat

Read more about: b saroja devi tollywood telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X