800 Movie Pre Release ముత్తయ్య మురళీధరన్ కోసం వీవీఎస్ లక్ష్మణ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

ఇంటర్నేషనల్ క్రికెట్‌ రంగంలో స్పిన్నర్‌గా అరుదైన రికార్డును క్రియేట్ చేసిన ముత్తయ్య మురళీధరన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే విషయం చెప్పడం కొత్త కాదు. తన బౌలింగ్ ప్రతిభతో 800 వికెట్లు, ఎంతో పాపులారిటీని సాధించిన ముత్తయ్య మురళీధరన్ ఆ స్థాయికి రావడానికి ఎన్నో సమస్యలను, ఇబ్బందులను అధిగమించారు.

ఆ విషయాలను తెర రూపం కల్పించేందుకు దర్శకుడు ఎంఎస్ శ్రీపతి సిద్దమయ్యారు. మురళీధరన్ బయోపిక్‌ను 800 టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే..

 800 movie pre release

లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో ముత్తయ్య మురళీధరన్‌గా స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటిస్తున్నారు. ఆయన భార్య మధిమలార్ రామ్మూర్తిగా మహిమ నంబియార్ నటిస్తున్నారు. ఈ సినిమాకు బుకర్ ప్రైజ్ విన్నర్ షెహన్ కరునటిలక రచనా సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వివేక్ రంగాచారి వ్యవహరిస్తూ.. మూవీ ట్రైన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు.

దక్షిణాదిలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తన శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకొన్న ఆయన దేశవ్యాప్తంగా ఈ సినిమాను 6వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 25న ఏర్పాటు చేయగా ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ గెస్టుగా వస్తున్నారు.

800 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. క్రికెట్ మైదానంలో ఇండియా తరఫున వీవీఎస్ లక్ష్మణ్, శ్రీలంక జట్టు తరఫున మురళీధరన్ బ్యాట్ బంతితో పోటీ పడ్డారు. క్రికెట్ మైదానం బయట వారిద్దరూ మంచి స్నేహితులు. మురళీధరన్‌తో ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని వీవీఎస్ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. మా ఈవెంట్‌కు వస్తున్న ఆయనకు మా ధన్యవాదాలు అని అన్నారు.

Legendary Cricketer VVS Laxman chief guest for Muttiah Muralitharans biopic 800 movie pre release event

ఇండియాలో మురళీధరన్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. సచిన్ టెండూల్కర్, జయసూర్య హాజరయ్యారు. ఈ సినిమా అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. ఈ బయోపిక్‌లో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ప్రేక్షకులను తప్పక ఆలరిస్తుందనే విశ్వాసంతో ఉన్నాం అని శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు.

నటీనటులు: మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్, నాజర్, వేలా రామ్మూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుళ్ దాస్, హరికృష్ణన్, శరత్ లోహిత్వస్వ తదితరులు

రచన, డైరెక్టర్: ఎంఎస్ శ్రీపతి
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సినిమాటోగ్రాఫర్: ఆర్డీ రాజశేఖర్
మ్యూజిక్ డైరెక్టర్: జిబ్రాన్
రిలీజ్ డేట్: 2023-10-06

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X