Mansoor Ali Khan త్రిషతో రేప్ సీన్... అలా ఎందుకు అనాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన నటుడు
హీరోయిన్ త్రిష కృష్ణన్ పై లియో నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దూమారం రేపుతున్న సంగతి తెలిసిందే. త్రిషతో బెడ్ రూమ్ సీన్స్ లో నటించాలని ఉందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా స్పందించారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై మన్సూర్ అలీ ఖాన్ స్పందించాడు. ఆయన ఎందుకు అలా అనాల్సి వచ్చిందో చెప్పుకువచ్చారు. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరోయిన్ త్రిష కృష్ణన్ ఇటీవల లియో సినిమాలో నటించింది. అయితే ఆమెతో నటించిన మన్సూర్ అలీఖాన్ ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషతో ఓ సీన్ గురించి మాట్లాడుతూ... గతంలో ఎన్నో తాను చిత్రాల్లో నటించారు... నేను రేప్ సీన్లలో నటించాను... లియోలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని ఊహించుకున్నా... కాకపోతే, అలాంటి సీన్ లేకపోవడం బాధగా ఉంది అంటూ మన్సూర్ అలీఖాన్ ఓ వీడియోలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ వ్యాఖ్యలపై హీరోయిన్ త్రిష ఫుల్ ఫైర్ అయింది. ఇలాంటి వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు సంతోషంగా ఉంది... ఆయన నా గురించి మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా... అతడి లాంటి క్రూరమైన వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు హ్యాపీగా ఉంది... నా ఫిల్మ్ కెరీర్ లో ఇలాంటి వారితో నటించకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటా.. ఇలాంటి వాళ్ల వల్లే.. చెడ్డపేరు వస్తుంది... అంటూ త్రిష తన ట్విట్టర్ వేదికగా స్పందించింది.
మరోవైపు ఈ మన్సూర్ వ్యాఖ్యలపై సీని పరిశ్రమ భగ్గుమంటుంది. లియో దర్శకుడు లోకేశ్ కనగరాజ్, నటి మాళవికా మోహనన్, సింగర్ చిన్మయి వంటి సెలబ్రిటీలు ఈ వ్యాఖ్యలపై స్పందించారు. మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. ఆయన తప్పుగా మాట్లాడరని.. తోటి కళాకారులు, మహిళలను గౌరవించకపోవడం బాధాకరం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో మన్సూర్ అలీ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందని... తనను గౌరవిస్తున్నానని చెప్పుకువచ్చారు. మన్సూర్ అలీ ఖాన్ ట్విట్టర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. అందులో.. నేను త్రిష గురించి గొప్పగా చెప్పుకువచ్చాను... అయితే వివాదాలను సృష్టించడానికి దానిని ఎడిట్ చేశారు... పాత సినిమాల్లో కథానాయికలతో నటించే అవకాశాలు రాలేదని... తన ఆవేదనను అలా హాస్యాస్పదంగా వ్యక్తం చేశాను అంటూ రాసుకువచ్చారు.
అయితే ఆ ఇంటర్వ్యూ వీడియోను... తప్పుగా ఎడిట్ చేసి.. తప్పుడు వీడియోను త్రిషకు చూపించారన్నారు.. తోటి నటీమణులను తాను ఎప్పుడూ గౌరవిస్తానని అందరికీ తెలుసునని కూడా పేర్కొన్నాడు. కాబట్టి, తనపై చేసిన వివాదం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నందున, తన రాబోయే సినిమా, రాజకీయ ప్రయాణాన్ని చెడగొట్టడానికేనని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











