Leo twitter Review రొలెక్స్ వర్సెస్ లియో.. క్లైమాక్స్ వేరే లెవెల్.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ

తమిళ్ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లియో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉండటంతో దాదాపు 34 దేశాలకుపైగా రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

ఇళయ దళపతి విజయ్ నటించిన లియో సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అమెరికా, యూకే, దుబాయ్ ఇతర దేశాల్లో భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లను తొలి రోజు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Leo twitter Review: Will Vijay and Lokesh Kanagaraj Hits the bull eye?

లియో ఫిల్మ్‌ను 40 నిమిషాల్లోనే తేల్చిపడేశాడు. లోకేష్ కనకరాజ్ అద్బుతంగా రూపొందించాడు. ఈ సినిమాలో సౌండ్ మిక్సింగ్, ఫైట్ డిజైన్ అద్బుతంగా ఉంది. అనిరుధ్ బీజఎం సూపర్బ్‌గా ఉంది అని నెటిజన్ పోస్టు పెట్టాడు.

లియో సినిమా ఎలా ఉందంటే.. స్కోర్ బోర్డు మీద రోహిత్ శర్మ స్కోర్‌లా పరుగులు పెడుతున్నది. లోకేష్ కనకరాజ్ టేకింగ్ బాగుంది. స్క్రీన్ ప్లేతో సినిమాను ఇరగదీశాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లియో గురించి ఒ నెటిజన్ రివ్యూ పెడుతూ.. ఫస్టాఫ్ గూస్ బంప్స్. మొదటి భాగంలో రెట్రో సాంగ్ అదిరిపోయింది. కాఫీ షాప్ ఫైట్ మామూలుగా లేదు. హైనా సీక్వెన్స్, విజయ్ మ్యానరిజమ్స్ బాగాలేవు. ఎల్‌సీయూ టచ్ అంతగా లేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లియో మూవీ ఫస్టాఫ్ చూశాను. తొలి భాగం ఆటమ్ బాంబులా ఉంది. యాక్షన్, కెమెరా, బీజీఎం, స్క్రీన్ ప్లేతో లోకేష్ కనకరాజ్ అదరగొట్టాడు అని ఓ అభిమాని పోస్టు పెట్టాడు.

దళపతి విజయ్ మైండ్ బ్లోయింగ్ ఫెర్ఫార్మెన్స్. టైటిల్ కార్డు అదిరిపోయింది. బీజీఎం ఇరగదీశాడు. లోకేషన్స్ అద్బుతంగా ఉన్నాయి. సినిమా ఫస్టాఫ్ అదిరిపోయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

దళపతి విజయ్ టైటిల్ కార్డు బాగుంది. సినిమా నేరేషన్ బాగుంది. హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉంది. మరోసారి లోకేష్ కనకరాజ్ ఫైర్ అయ్యాడు. సుత్తి పెట్టకుండా కథలోకి నేరుగా తీసుకెళ్లాడు. సినిమాలో నాన్సెన్స్ అనేది కనిపించలేదు. సినీ ప్రేక్షకులకు పండగ పూట భోజనంలా లియో ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లియో సినిమా ఊహకు అందని చిత్రంగా ఉంది. బాంబులు, కత్తులు, చెవులు చిల్లుపడేలా బీజీఎం తప్ప ఏమీ లేదు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎక్కక పోవచ్చు. ఎలా ఆడుతుందో చూడాలి. త్రిష, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవన్ మీనన్ క్యారెక్టర్లు బాగా డీల్ చేయలేదు. లోకేష్ కనకరాజ్, నెల్సన్, అట్లీ, ప్రశాంత్ నీల్ హీరోలను బాగానే ఎలివేట్ చేస్తారు. కానీ తాము తీసే సినిమా కంటే ఎక్కువగా హైప్ ఇవ్వడం మైనస్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లియోకు రొలెక్స్ మధ్య ఫైట్ వేరే లెవెల్. అరాచకానికి కేరాఫ్ అడ్రస్. క్లైమాక్స్ సీన్ అదిరిపోయింది. బీజీఎం వేరే లెవెల్. ఇండస్ట్రీ హిట్ లోడింగ్. ఈ సినిమా 1000 కోట్లు సంపాదించడం గ్యారెంటీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు

లియో ఫస్టాఫ్ చూశాను. మూవీ చాలా బాగున్నది. ఫస్టాఫ్ చూసిన తర్వాత సెకండాఫ్ మరింత అదిరిపోతుందనే ఫీలింగ్ కలిగింది. సెకండాఫ్ కూడా బాగానే ఉందనే ఆశతో ఉన్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లియో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విశాల్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. లియోలో భాగమైన ప్రతీ ఒక్కరికి, ఇళయ దళపతి విజయ్‌కు విషెస్. ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకొంటున్నాను. నేను థియేటర్‌లో చూసేందుకు రెడీగా ఉన్నాను. మీరు కూడా మిస్ కావొద్దు అని విశాల్ ట్వీట్ చేశారు.

కేరళలో లియో సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తున్నది. అక్టోబర్ 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచే సంబరాలు మొదలుపెట్టారు. అభిమానులు భారీ ఎత్తున్న థియేటర్ వద్ద గుమ్మికూడి డ్యాన్సులతో హోరెత్తించారు.

తమిళ సినిమా పరిశ్రమలో లియో చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతున్నది. కోలీవుడ్‌లో తొలి 100 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేయబోతున్నది. విజయ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీ అవుతున్నది. తమిళ సినిమా రంగంలో హిస్టరీగా మారబోతున్నది.

విజయ్ నటించిన లియో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. విజయ్ నటించిన లియో సినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానున్నది. నేను ఫ్యాన్స్‌తోపాటు కలిసి చూడబోతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు నా విషెస్. అలాగే లోకేష్ కనకరాజ్, 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌కు నా శుభాకాంక్షలు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ట్వీట్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X