సంక్రాంతి బరిలో అల్లు అర్జున్.. మా ఫ్యామిలీతో మీరు కూడా అంటూ..
హారికా అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది ఆయనకు 19వది. దాంతో ఈ సినిమాను AA19గా పిలుస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు అల్లు అర్జున్ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు, సినీ అభిమానులకు ఇంపార్టెంట్ అప్‌డేట్. అల్లు అర్జున్ 19వ (AA19) సినిమాను సంక్రాంతి 2020కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్ణయించాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ పక్కన పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. ఈ సంక్రాంతిని మా ఫ్యామిలీతో గడపేలా సినిమాను రిలీజ్ చేస్తున్నాం అని ఓ ప్రకటనలో తెలిపారు.

మీడియా కథనాల ప్రకారం.. AA19 సినిమాకు అలకనంద పేరును పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అలకనంద టైటిల్ పూజా హెగ్డేకు పెట్టనున్నారా? లేక టబు పాత్ర పేరా అనేది ఆసక్తిగా మారింది. ఇంతకు అలకనంద ఎవరనేది త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.
తెర వెనుక, తెర ముందు
నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ (చినబాబు)
సినిమాటోగ్రఫి: పీఎస్ వినోద్
మ్యూజిక్: ఎస్ థమన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
స్టంట్స్: రామ్ లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పీడీవీ ప్రసాద్
బ్యానర్: హరికా అండ్ హాసిని, గీతా ఆర్ట్స్


Click it and Unblock the Notifications











