ఫ్యాన్సీ రేటుకు ‘లైఫ్ అనుభవించు రాజా’ హక్కులు.. రవితేజ జూనియర్ హీరోగా..

టాలీవుడ్‌లో విలక్షణమైన కథ, కథనాలతో వస్తున్న చిన్న తరహా చిత్రాలకు ప్రేక్షకులు భారీగా పట్టం కడుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే చాలూ పెద్ద హీరోనా? చిన్న హీరోనా అనే తేడా లేకుండా సక్సెస్‌ను అందిస్తున్నారు. అలాంటి తరహాలోనే వస్తున్న చిత్రం లైఫ్ అనుభవించు రాజా. రాజారెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై, ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో రవితేజ (జూనియర్), శృతి శెట్టి, శ్రావణి నిక్కీ హీరోహీరోయిన్లుగా రూపొందింది. సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో రాజారెడ్డి కందల నిర్మించిన రామ్ కామ్ ఎంటర్‌టైనర్ 'లైఫ్ అనుభవించు రాజా' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నది. కాగా లైఫ్ అనుభవించు రాజా చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్‌ని ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య ఫాన్సీ రేటుకు సొంతం చేసుకోవడం చర్చనీయాంశమైంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేష్ తిరుమూర్ మాట్లాడుతూ.. ''చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రం బాగా రావడానికి నిర్మాత ఎంతగానో తోడ్పాటు అందించారు. నటీనటులు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్‌గారి స్కూల్‌ నుంచి వచ్చిన మా సంగీత దర్శకుడు రామ్ అందించిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. మా చిత్ర ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు ఫ్యాన్సీ రేటుకు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో ఆడియో మరియు మూవీ విడుదల తేదీలను ప్రకటిస్తాము..'' అన్నారు.

Life Anubhavinchu Raja movie audio sold for fancy rate

నటీనటులు,సాంకేతిక వర్గం
నటీనటులు: రవితేజ (జూనియర్), శృతి శెట్టి, శ్రావణి నిక్కీ తదితరులు
సంగీతం: రామ్
కెమెరామెన్: రజిని,
ఎడిటింగ్: సునీల్ మహరాణా,
నిర్మాత: రాజారెడ్డి కందల,
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: సురేష్ తిరుమూర్

Life Anubhavinchu Raja movie audio sold for fancy rate

More from Filmibeat

Read more about: tollywood raviteja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X