హీరోగా రీసెట్ చేస్తున్న సుధాకర్ కోమాకుల.. అజ్జు మహాకాళి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఉందిలే మంచి కాలం ముందు ముందునా ', ' నువ్వు తోపు రా' తదితర చిత్రాలతో కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకొన్న సుధాకర్ కోమాకుల 'రీసెట్' పేరుతో మరో విభిన్నమైన చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా అజ్జు మహాకాళి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సుఖ స్టూడియోస్ సమర్పణలో హైలైట్ విజువల్స్, కారా బూందీ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ రోజు (నవంబర్ 12) హీరో సుధాకర్ కోమాకుల పుట్టినరోజు. ఈ సందర్బంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

దర్శకుడు అజ్జు మహాకాళి మాట్లాడుతూ- ''న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ‌లో డిప్లమా ఇన్ ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాను. సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన 'నువ్వు తోపు రా' కి కథ- మాటలు అందించాను. దర్శకునిగా ఇదే నా తొలి ప్రయత్నం. కథ నచ్చి సుధాకర్ వెంటనే ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. లాక్ డౌన్ 1.0 టైంలో జరిగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది.

Life is beautiful fame Sudhakar Komakualas Reset with Ajju Mahakaali

ఇందులో హీరో క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రపంచం లాక్ డౌన్ అయినాకనే అతని ప్రపంచం ఓపెన్ అయ్యింది. ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే- వాస్తవం, కల్పితం కన్నా కిరాక్ ఉంటది. డిసెంబర్ లో చిత్రీకరణ మొదలుపెడతాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి సిద్దం మనోహర్ కెమెరా, డెన్నిస్ నార్టన్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.

Life is beautiful fame Sudhakar Komakualas Reset with Ajju Mahakaali

ఇటీవల కాలంలో సుధాకర్ కోమాకులు రూపొందించిన వీడియో ఒకటి ట్రెండింగ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజున ఛాలెంజ్ సినిమాలోని ఇందువదన పాటకు తన జీవిత భాగస్వామితో కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. స్వయంగా సుధాకర్ దంపతులను చిరంజీవి ప్రశంసించారు. వారి మధ్య కెమిస్ట్రీని, వారు చూపించిన హావభావాలపై గురించి మెగాస్టార్ చిరంజీవి చెబుతూ పొగడ్తలతో ముంచెత్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X