రూమర్స్ పై మళ్ళీ క్లారిటీ ఇచ్చిన ఛార్మి.. దానిపైనే ఫోకస్ అంటూ షాకింగ్ కౌంటర్
ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్న ఛార్మి ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో వరుసగా సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో కేవలం ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల వచ్చిన లైగర్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తదుపరి సినిమా జనగణమన విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్న సమయంలో చార్మి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

లైగర్ డిజాస్టర్
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో సినిమా వస్తోంది అనగానే అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తప్పకుండా ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని కూడా సినీ పండితులు అంచనా వేశారు. కానీ లైగర్ సినిమా ట్రైలర్ తోనే నిరాశపరచడంతో ఆ తర్వాత సినిమాలో సైతం కంటెంట్ అక్కట్టుకోకపోవడం వలన బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంది.

లైగర్ నష్టాలతో ఒత్తిడి
లైగర్ సినిమాపై పెట్టిన పెట్టుబడి సగం కూడా వెనక్కి రాకపోవడంతో నిర్మాత ఛార్మి ఆర్థికంగా చాలా వరకు నష్టపోయినట్లు కూడా అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. అంతేకాకుండా బయ్యర్లు కొంత నష్టాలను భర్తీ చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు అని దీంతో చార్మి పూరి జగన్నాథ్ మధ్యలో కూడా కొంత గ్యాప్ వచ్చినట్లు టాక్ అయితే వినిపించింది.

మళ్ళీ మొదలు
అయితే చార్మి పూరి జగన్నాథ్ మధ్యలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోలేదు అని ఇంతకుముందు వారు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే తరహాలో ఉన్నారు అని మళ్ళీ పూరి కనెక్ట్స్ కూడా మొదలవుతుంది అని ఇండస్ట్రీలో మరొక టాక్ అనిపించింది. అదే సమయంలో చార్మి కూడా మళ్లీ PC కనెక్ట్స్ యధావిధిగా కొనసాగుతుంది అని కూడా వివరణ ఇచ్చారు.

ఛార్మి క్లారిటీ
అయితే ఇటీవల లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తదుపరి సినిమా జనగణమన కూడా క్యాన్సిల్ అయినట్లు అనేక రకాల కథనాలు అయితే వెలుపడ్డాయి. విజయ్ దేవరకొండ కూడా ఆ సినిమా చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని కూడా ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతూ ఉండడంతో వెంటనే ఛార్మి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

అవన్నీ రూమర్స్ అంటూ..
రీసెంట్ గా సోషల్ మీడియాలో బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పిన ఛార్మి ఇప్పుడు రూమర్స్ ఎక్కువ కావడంతో మళ్ళీ క్లారిటీ ఇవ్వక తప్పలేదు. రూమర్స్ రూమర్స్ మొత్తం అన్ని కూడా రూమర్స్ అంటూ రూమర్లన్నీ కూడా ఫేక్ అని ట్విట్టర్ లో తెలిపింది. ప్రస్తుతం మేము తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తున్నాను అని అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన ఛార్మి అప్పటివరకు రూమర్స్ RIP చెప్పాలి అని ఆమె ప్రత్యేకంగా వివరణ ఇచ్చింది. అయితే చార్మి క్లారిటీలో జనగణమన క్యాన్సిల్ కాలేదు అని వివరణ మాత్రం ఇవ్వలేదు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











