Liger సినిమా బడ్జెట్ ఎక్కువైంది.. చేతిలో రూపాయి లేదు.. ఇంటర్వ్యూలో ఛార్మి కంటతడి!

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న హై వోల్టేజ్ మూవీ లైగర్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అభిమానుల్లో బలమైన నమ్మకం అయితే ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచిగా హైప్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. అక్కడ కూడా ఊహించని రేంజ్ లో ఓపెనింగ్ అందే అవకాశం అయితే ఉంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు రెగ్యులర్ ప్రమోషన్స్ తో చాలా బిజీగా మారిపోయారు. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయాలపై ఇటీవల కో ప్రొడ్యూసర్ ఛార్మి చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

పవర్ఫుల్ కాంబినేషన్

పవర్ఫుల్ కాంబినేషన్

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో చేస్తున్న మొట్టమొదటి సినిమా టైగర్.. అది కూడా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి వస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా పూరి జగన్నాథ్ మొదటిసారి ఒక ప్రాజెక్టు కోసం అత్యధిక సమయాన్ని తీసుకున్నాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

 నార్త్ లో విజయ్ రేంజ్

నార్త్ లో విజయ్ రేంజ్

గ్యాప్ లేకుండా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా కూడా జనాలు భారీ సంఖ్యలో ఎగబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అలాగే సరిహద్దు రాష్ట్రాల్లో జనాలు రావడం మామూలే.. కానీ ఇంతవరకు నార్త్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ పెద్దగా హడావిడి చేసింది లేదు. అలాంటిది అతని వస్తున్నాడు అంటే అక్కడి యువత భారీ సంఖ్యలో విజయ్ ను చేసేందుకు ఎగబడుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 యూనిట్ స్పెషల్ ఇంటర్వ్యూ

యూనిట్ స్పెషల్ ఇంటర్వ్యూ

నార్త్ ఇండస్ట్రీలో మొన్నటి వరకు చాలా బిజీగా ప్రమోషన్స్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా హడావిడి మొదలుపెట్టారు. ఇక ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. రీసెంట్ గా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ చార్మి ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకు చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మాట్లాడుతూనే కొంత ఎమోషనల్ గా కూడా ఫీలయ్యారు.

 బడ్జెట్ ఎక్కువయ్యింది

బడ్జెట్ ఎక్కువయ్యింది

సినిమా గురించి అనేక విషయాలపై మాట్లాడిన ఛార్మి బడ్జెట్ విషయానికి వచ్చేసరికి కొంత ఎమోషనల్ గా స్పందించారు. బడ్జెట్ ఒక విధంగా అనుకున్న దానికంటే ఎక్కువగా పెరిగిపోయింది. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అలాంటి సమయంలో ఓటీటీ నుంచి చాలా గొప్ప ఆఫర్ అయితే వచ్చింది. అలాంటి సమయంలో ఆ ఆఫర్ వదులుకోవాలి అంటే కూడా ధైర్యం కావాలి అని చార్మి వివరణ ఇవ్వడం ఆ ఇంటర్వ్యూలో హైలెట్ గా నిలిచింది.

 ఛార్మి కంటతడి

ఛార్మి కంటతడి

అలాగే ఇంత కష్టపడి ఈ సినిమాను తీశారు కదా జనాలు థియేటర్ వరకు రాకపోతే పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న గురించి కూడా చర్చించుకోవడం ఆసక్తిగా ఉంది. అందులో ఛార్మి కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ ఫుల్ ఇంటర్వ్యూ వీడియోను పూరి జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్ లో త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాడు. ఏదేమైనా కూడా చిత్ర యూనియ్ సభ్యులు రియాలిటీ కి తగ్గట్టుగానే ఇంటర్వ్యూలో తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X