దెయ్యాల్ని లైవ్‌లో చూసిన ఫీలింగ్ కలిగించే 3డి ఎఫెక్టుతో ‘లీసా’

అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతున్న హారర్ మూవీ "లిసా". వీరేష్ కాసాని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. మే 24న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా గురువారం సాయంత్రం విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ "అంజలి మంచి ఆర్టిస్టు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది, సురేష్ కొండేటి‌కి, లిసా యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్" అన్నారు.

'లీసా' మూవీ 3డిలో తెరకెక్కించడంతో దెయ్యాల్ని లైవ్‌లో చూసిన ఫలింగ్ కలుగుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఇది రెగ్యులర్ దెయ్యం కాదు.. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే 3డి దెయ్యం ఇది. థియేటర్లలో ధడధడ లాడిస్తుంది. ప్రేక్షకుడికి గజగజను పరిచయం చేసే అరుదైన దెయ్యమని సురేష్ కొండేటి తెలిపారు.

 Lisaa 3D trailer launched by Venkatesh

'లీసా' ఇప్పటి వరకు వచ్చిన అన్ని హారర్ సినిమాల కంటే ది బెస్ట్‌గా ఉంటుంది... జర్నీ, షాపింగ్ మాల్ తర్వాత మా ఎస్.కె పిక్చర్స్‌లో విడుదలవుతున్న యూనిక్ మూవీ ఇది. కథాంశం సింపుల్‌గా కనిపించినా ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేషన్‌తో రక్తి కట్టిస్తుందని తెలిపారు.

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య, మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి, ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్, స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్, కోరియోగ్రఫీ: సురేష్, ఆర్ట్ డైరెక్టర్: వినోద్, సమర్పణ కాసాని వీరేశ్ , నిర్మాత సురేష్ కొండేటి, కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X