అల్లు అయాన్ బర్త్ డే.. మిస్ అవుతున్నానంటూ అల్లు శిరీష్ పోస్ట్
అల్లువారి ఇంట్లో ఈ రోజు పండుగ వాతావరణమే. ఎందుకు అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఆరో వసంతంలోకి అడుగుపెట్టిన రోజు. ఈ మేరకు అల్లు అర్జున్ షేర్ చేసిన ఫోటోలు, చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. అన్నింటి కంటే బన్నీ చేసిన ట్వీట్, చెప్పిన మాటలు.. తనయుడిపై ఉన్న ప్రేమను చాటి చెబుతున్నాయి. ఈ మేరకు అల్లు అయాన్ బర్త్ డేకు బాబాయ్ అల్లు శిరీష్ కూడా విషెస్ తెలుపుతూ తెగ బాధపడ్డాడు.
ప్రేమంటే ఇన్ని రోజుల ఏదో అనుకున్నానని, అయితే ప్రేమంటే ఏంటో మాత్రం కచ్చితంగా తెలిసిదే కాదని, నువ్వు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చావో అప్పుడే ప్రేమంటే ఏంటో తెలుసుకున్నానని కొడుకును ఉద్దేశించి అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే లాక్ డౌన్ ఉండటంతో ఈ వేడుకలు అల్లు అర్జున్, అల్లు స్నేహల వరకే పరిమితమైంది.

లాక్ డౌన్ ఉండటం మూలాన అల్లు అయాన్ బర్త్ డే వేడుకుల చాలా సింపుల్‌గా జరిగాయి. బన్నీ, స్నేహా రెడ్డి, అర్హలు అయాన్ పుట్టిన రోజును సెలెబ్రేట్ చేశారు. ఈ మేరకు బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బర్త్ డేన నిన్ను మిస్ అవుతున్నానంటూ బాబాయ్ అల్లు శిరీష్ చేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











