twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్ని సార్లు చెప్పినా తక్కువే.. లోకేష్ కనకరాజ్ ఎమోషనల్

    |

    దళపతి విజయ్.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన మాస్టర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా తమిళా నాటలో భారీ విజయాన్ని నమోదు చేసింది. కరోనా సమయంలో రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. తమిళనాడులో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా మాస్టర్ నిలిచింది. దాదాపు 300 కోట్ల వసూళ్లను మాస్టర్ రాబట్టింది.

    ఓటీటీలో ఈ మూవీ విడుదలైనా కూడా థియేటర్లో ఇంకా రన్ అవుతూనే ఉంది. నేటికి ఈ మూవీ విడుదలై 50వ రోజు. ఈమేరకు చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎమోషనల్ అయ్యాడు. మాస్టర్ మూవీ షూటింగ్ నాటి విషయాలను పంచుకుంటూ ఇద్దరూ హీరోలకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఈ మేరకు వదిలిన మేకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

     lokesh Kanagaraj about Vijay Master 50th day

    క్లైమాక్స్ సీన్‌లో తలపడే సీన్ మేకింగ్ వీడియోను షేర్ చేసిన లోకేష్ కనకరాజ్.. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది.. థాంక్యూ విజయ్ అన్నా.. విజయ్ సేతుపతి అన్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికీ ఈ ఏడాది ప్రారంభంలోనే కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌తో బాక్సాఫీస్ వద్ద బోణి మొదలైంది. తెలుగులోనూ మాస్టర్ మంచి వసూళ్లనే రాబట్టింది. అమెజాన్‌ ప్రైమ్‌లోనూ ఈ మూవీ దూసుకుపోతోంది.

    English summary
    lokesh Kanagaraj about Vijay Master 50th day
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X