Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్ని సార్లు చెప్పినా తక్కువే.. లోకేష్ కనకరాజ్ ఎమోషనల్
దళపతి విజయ్.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా తమిళా నాటలో భారీ విజయాన్ని నమోదు చేసింది. కరోనా సమయంలో రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. తమిళనాడులో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా మాస్టర్ నిలిచింది. దాదాపు 300 కోట్ల వసూళ్లను మాస్టర్ రాబట్టింది.
ఓటీటీలో ఈ మూవీ విడుదలైనా కూడా థియేటర్లో ఇంకా రన్ అవుతూనే ఉంది. నేటికి ఈ మూవీ విడుదలై 50వ రోజు. ఈమేరకు చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎమోషనల్ అయ్యాడు. మాస్టర్ మూవీ షూటింగ్ నాటి విషయాలను పంచుకుంటూ ఇద్దరూ హీరోలకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఈ మేరకు వదిలిన మేకింగ్ వీడియో వైరల్ అవుతోంది.
క్లైమాక్స్ సీన్లో తలపడే సీన్ మేకింగ్ వీడియోను షేర్ చేసిన లోకేష్ కనకరాజ్.. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది.. థాంక్యూ విజయ్ అన్నా.. విజయ్ సేతుపతి అన్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికీ ఈ ఏడాది ప్రారంభంలోనే కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌తో బాక్సాఫీస్ వద్ద బోణి మొదలైంది. తెలుగులోనూ మాస్టర్ మంచి వసూళ్లనే రాబట్టింది. అమెజాన్ ప్రైమ్‌లోనూ ఈ మూవీ దూసుకుపోతోంది.