క్రేజీగా ఫస్ట్‌లుక్ లవ్, లైఫ్ అండ్ పకోడి.. సోషల్ మీడియాలో వైరల్
జీవితంలో ఏ బంధమైనా చాలా సాధారణంగా మొదలై కొన్నిసార్లు క్లిష్టపరిస్థితుల్లోకి వెళ్తుంది. అలాంటి కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రం లవ్ లైఫ్ అండ్ పకోడి. ఈ చిత్రం ఓ జంట జర్నీని తెలియజేస్తుంది. జీవితంలోని కన్ఫ్యూజన్స్, కాంప్లికేషన్స్‌తో సాగుతుంది. ప్రతీ అడుగులోనూ వారు జీవిత పరమార్ధాన్ని తెలుసుకొంటారు. ఇంట్రెస్టింగ్ ఉన్న కథ కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై మధురా శ్రీధర్ రెడ్డి సమర్పణలో రూపొందింది.
లవ్ లైఫ్ అండ్ పకోడి చిత్రానికి జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ మూవీ పోస్టర్‌కి సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. కార్తిక్ , సంచిత హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఒక రిలేషన్ కి కమిట్ అయ్యేందుకు తటపటాయించే ఈ జంటకు వారి మధ్య ప్రేమే సమస్యగా ఎలా మారుతుంది అనేది ఆసక్తిగా తెరమీదకు కనువిందు చేయబోతుంది.

లవ్ లైఫ్ అండ్ పకోడి చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా దర్శక, నిర్మాత జయంత్ గాలి మాట్లాడుతూ.. ఏ రిలేషన్‌లోనైనా కమిట్ అవడానికి భయపడతారు. కన్ ఫ్యూజ్ అవుతారు..కరెక్టా కాదా అనే సందేహాంలో పడిపోతారు. వారి మధ్య ఆకర్షణలు, ప్రేమలు ఉంటాయి. కానీ వారి బాండింగ్‌కి ఎలాంటి రిలేషన్‌తో ముడి పెట్టడానికి ఇష్టపడరు.. అదే మా ప్రేమ కథ. మోడ్రన్ సొసైటీలో నేటి జనరేషన్ లివింగ్ స్టెయిల్‌ని ప్రతి బింబించే ఈ కథ తప్పకుండా యూత్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి. థియేటర్స్‌కి అనుమతులు లభించగానే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటాం అని అన్నారు.
కార్తిక్ బిమల్ రెబ్బ , సంచిత పొనాచ, జంటగా నటిస్తున్న ఈచిత్రంలో ఆకర్ష్ రాజ్ భాగవతుల, క్రిష్ణ హాబ్బల్ , కళా జ్యోతి , అనురాధ మల్లికార్జున ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం:
డివోపి: సాగర్ వైవివి జతిన్ మోహాన్
మ్యూజిక్: పవన్
ఎడిటర్: శ్రవన్ కటికనేని
ఆర్ట్: దండు రెంజీవ్
పిఆర్‌ఓ: జియస్‌కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట సిద్దారెడ్డి
సమర్సణ: మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత,రచన,దర్శకత్వం: జయంత్ గాలి


Click it and Unblock the Notifications











