‘లవ్ స్టోరీ’ ప్రమోషన్స్ షురూ.. అక్కడ రానాతో రచ్చ
ప్రస్తుతం శేఖర్ కమ్ముల లవ్ స్టోరీపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. సారంగ దరియా పాటతో సాయి పల్లవి మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అయింది. తెలుగులో అత్యంత వేగంగా వంద మిలియన్లు సాధించిన లిరికల్ వీడియోగా సారంగదరియా రికార్డులకెక్కింది. అదంతా కేవలం సాయి పల్లవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సాయి పల్లవి డ్యాన్సులకు ఫిదా అవ్వని వారెవ్వరూ ఉండరు. అలా ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాపై మంచి బజ్ ఉంది. ఈ క్రమంలో ఈ మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు రానా షోకి గెస్ట్‌గా విచ్చేశారు. రానా నంబర్ వన్ యారీ షో గురించి అందరికీ తెలిసిందే. ఇప్పడు ఈ షో మూడో సీజన్ ఆహాలో ప్రసారం అవుతోంది. ఇప్పటికే రెండు మూడు ఎపిసోడ్‌లు అయ్యాయి. దాదాపు అందరూ కూడా సినిమా ప్రమోషన్స్ కోసమే వస్తున్నారు.

జాతిరత్నాలు, గాలి సంపత్, రంగ్ దే టీం కూడా రానాతో ముచ్చట్లుపెట్టారు. ఇప్పుడు లవ్ స్టోరీ టీం వంతు వచ్చింది. అయితే ఇందులో శేఖర్ కమ్ములతో లీడర్ సినిమా తీశాడు రానా. ఇక సాయి పల్లవితో విరాట పర్వం చేస్తున్నాడు. నాగ చైతన్య కుటుంబ సభ్యుడే. మొత్తానికి షోలో రానాతో కలిసి లవ్ స్టోరీ టీం సందడి చేసినట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ 16న లవ్ స్టోరీ అందరి ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











