‘లవ్ స్టోరీ’ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై తాజా అప్‌డేట్: రెండు డేట్లూ ఫిక్స్ అయ్యాయట

ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఈ క్రమంలోనే విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములతో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేస్తున్నాడు. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఫీమేల్ లీడ్‌గా చేస్తోంది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పోస్టర్లు, పాటలు, టీజర్‌‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది.

'లవ్ స్టోరీ' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే చిత్రంలోని పాటలు, టీజర్ విడుదల చేసింది. అలాగే, ఏప్రిల్ 8న ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోన్న నేపథ్యంలో చాలా తక్కువ మందితో ఈ ఫంక్షన్‌ను చాలా తక్కువ మందితో నిర్వహించనున్నారని సమాచారం.

Love Story Trailer and Pre Release Event Dates Fix

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లవ్ స్టోరీ'లో నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నాడని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. అలాగే, సాయి పల్లవి కూడా డ్యాన్సర్‌గానే కనిపించనుందని అంటున్నారు. ఇటీవల విడుదలైన పాటల్లో వాళ్లిద్దరూ పోటాపోటీగా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇది ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X