twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రేజీగా లవర్స్ డే హీరోయిన్.. ఉల్లాలా ఉల్లాలా మూవీతో గ్రాండ్ ఎంట్రీ

    |

    మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన ఒరు ఆదార్ ల‌వ్‌ చిత్రం రిలీజ్‌కి ముందు ప్రియా వారియ‌ర్‌కి ఎంత పేరు తీసుకొచ్చిందో, రిలీజ్ త‌ర్వాత నూరిన్‌కి అంత పేరు తీసుకువచ్చింది. ఈ చిత్రం తెలుగులో ల‌వ‌ర్స్ డే పేరుతో అనువాద‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళంలో ఫుల్ బిజీ అయిన నూరిన్ తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఉల్లాలా ఉల్లాలా. సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వంలో సుఖీభ‌వ మూవీస్ ప‌తాకంపై ఎ.గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌త్య‌ప్ర‌కాశ్ మాట్లాడుతూ ఇదొక వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రం.

    రొమాంటిక్ ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాలో నూరిన్ పాత్ర చాలా కీల‌కం. ఆమె త‌న గ్లామ‌ర్‌తోనూ, పెర్ ఫార్మెన్స్ తోనూ క‌చ్చితంగా తెలుగు ప్రేక్ష‌క హృద‌యాల‌ను కొల్ల‌గొట్ట‌డం ఖాయం. ఉల్లాలా ఉల్లాలా రిలీజ్ త‌ర్వాత నూరిన్ తెలుగులో కూడా బిజీ హీరోయిన్ అవుతుంది. ఈ పాత్ర‌కు నూరిన్ అయితే బాగుంటుంద‌ని చెప్ప‌గానే, మా నిర్మాత గురురాజ్ వెంట‌నే ఆమెతో మాట్లాడి ఒప్పించారు. ఈ సినిమాలో క‌నిపించే పాత్ర‌లు... నిజ‌మైన‌వి కావు. వాళ్లు మ‌నుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మ‌నుషులు. దెయ్యాలా? మ‌నుషులా? అంటే ఎవ‌రూ కారు. మా చిత్రంలో ఉన్న‌ది లేదు... లేనిదే ఉన్న‌ట్టు అని చెప్పారు.

     Lovers day fame Noorin grand entry in Tollywood

    నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ మా బేన‌ర్‌లో ర‌క్ష‌క‌భ‌టుడు, ఆనందం మ‌ళ్లీ మొద‌లైంది, ల‌వ‌ర్స్ డే చిత్రాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా ఉల్లాలా ఉల్లాలా. ఇలాంటి కాన్సెప్ట్ లు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. స‌త్య‌ప్ర‌కాశ్‌కి న‌టునిగా ఎంత పేరుందో, ద‌ర్శ‌కునిగా అంత‌క‌న్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను అని తెలిపారు.

    క‌థానాయిక నూరిన్ మాట్లాడుతూ తెలుగులో నాకు చాలా అవ‌కాశాలు వ‌చ్చినా, ఈ క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశాను. నా పాత్ర క్లాస్‌కు, మాస్‌కూ న‌చ్చుతుంది. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను అని చెప్పారు.

    తారాగ‌ణం:
    న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, అదుర్స్ ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు

    సాంకేతిక నిపుణులు:
    స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి ఎ.ముత్త‌మ్మ‌,
    ఛాయాగ్ర‌హ‌ణం: జె.జి.కృష్ణ‌, దీప‌క్‌,
    సంగీతం: జాయ్‌,
    ఎడిటింగ్‌: ఉద్ధ‌వ్‌,
    నృత్య ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌,
    యాక్ష‌న్‌: డ్రాగ‌న్ ప్ర‌కాష్‌,
    ఆర్ట్: కె.ముర‌ళీధ‌ర్‌,
    పాట‌లు: కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌ర‌ణ్‌,
    క‌థ - నిర్మాత‌: ఎ.గురురాజ్‌,
    స్క్రీన్‌ప్లే - మాట‌లు - ద‌ర్శ‌క‌త్వం: స‌త్య‌ప్ర‌కాష్‌.

    English summary
    Senior actor Satya Prakash turns as director for Ullaala Ullaala. Produced by A Guru Raj. Nataraj, Naurin, Ankita, Guru Raj are the lead actors. This movie getting ready for release soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X