Lucky Baskhar Trailer Review: డ్రగ్స్ కంటే డబ్బే ఎక్కువ కిక్.. లక్కీ భాస్కర్ ట్రైలర్ రివ్యూ!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై పాపులర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ నటించిన ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నది. ఈ మూవీ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్నది. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

లక్కీ భాస్కర్ ట్రైలర్‌ లవ్, ఎమోషన్స్, యాక్షన్ లాంటి అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డబ్బు కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. అతను మంచివాడు లేదా చెడ్డవాడిగా ఉండాలనుకోవడంలేదు. తాను తలచుకుంటే ఏదైనా చేయగలిగే అంత ధనవంతుడు కావాలని అనుకుంటాడు. బాగా డబ్బు సంపాదిస్తే, శ్వాస కూడా గౌరవించబడుతుంది అనేది అతని సిద్ధాంతం.

Lucky Baskhar Trailer Review

భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా ఒదిగిపోయారు. డిఫరెంట్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో దురాశ, ప్రేమ, బెంగ, అహంకారం, విశ్వాసం ఇలా ప్రతి భావోద్వేగాన్ని చక్కగా పలికించారు. లక్కీ భాస్కర్‌గా మరోసారి బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారనే విషయం ట్రైలర్‌లో స్పష్టమైంది. భాస్కర్‌గా దుల్కర్ నూటికి నూరు శాతం న్యాయం చేశారని ట్రైలర్‌తోనే స్పష్టమైంది.

Lucky Baskhar Trailer Review

తొలి ప్రేమ, సార్ లాంటి సినిమాల తర్వాత రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి కలం నుంచి జాలువారిన భాస్కర్ అనే అద్భుతమైన పాత్రను దుల్కర్ సల్మాన్ తన భుజాలపై మోసి మరో స్థాయికి తీసుకెళ్లారనే విషయం ట్రైలర్‌లో కనిపించింది. "Sumathi, I'm not bad, I'm just rich", "సిగరెట్, అల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ అంటూ రాసిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి.

Lucky Baskhar Trailer Review

మాటల్లో అహంకారం ఎందుకు అంటూ భార్య సుమతి ప్రశ్నిస్తే..ధైర్యం అంటూ సమాధానం.. అలాగే చేతిలో బలుపు అంటే అంటే బలం అంటూ జవాబు ఇవ్వడం చాలా ఎమోషనల్‌గా కనిపించాయి. ఇది ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. గౌరవం కావాలంటే మన ఒంటిపై డబ్బు ఉండాలి అంటూ భాస్కర్ పాత్ర ద్వారా దర్శకుడు వెంకీ అట్లూరి కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు.

ఆరు వేల రూపాయలు సంపాదించే ఉద్యోగి కోట్లు ఎందుకు సంపాదించాలని అనుకొన్నారు. పేదరికానికి బార్డర్ లైన్‌లో ఉన్న చిరు ఉద్యోగి భాస్కర్‌ను సుమతి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకొన్నది. కోట్లు సంపాదించే క్రమంలో భాస్కర్ అడ్డదార్లు తొక్కాడా? తన బలంగా భావించే భాస్కరన్ ఆయన భార్య ఎందుకు అసహ్యించుకొన్నది? అనే ప్రశ్నలకు సమాధానమే లక్కీ భాస్కర్ సినిమా కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X