కిరణ్ అబ్బవరంతో నాకు గొడవేంటీ? లక్కీ భాస్కర్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

Naga Vamsi: హీరో దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ మూవీ తో పాటు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'క' మూవీ పోటీగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ నాగ వంశీకి, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మధ్య మాటల యుద్ధం జరిగినట్లు పలు కథనాలు వచ్చాయి. ఈ రూమర్స్ పై ప్రొడ్యూసర్ నాగ వంశీ స్పందిస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ఇంతకీ స్టార్ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే..

దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్ గా నటించిన మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీ లో రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్ర పోషించారు. అక్టోబర్ 31న తెలుగు,మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీపావళి కానుక విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రొడ్యూసర్ నాగవంశీ .. హీరో కిరణ్ అబ్బవరం పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Lucky Bhasker movie producer Naga Vamshi made shocking comments on hero Kiran Abbavaram Controversy

లక్కీ భాస్కర్ మూవీ తాము అనుకున్న దాని కంటే మంచి హిట్ సాధించిందని, తాను ఫ్రీ రిలీజ్ టైం లోనే చాలెంజ్ చేశానని గుర్తు చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. సోషల్ మీడియాలో కూడా తమ మూవీపై ఎలాంటి నెగటివ్ కామెంట్స్ రావట్లేదని, అలాగే మూవీ రివ్యూస్ కూడా మంచి రేటింగ్ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఓ ఇంట్రెస్ట్ అప్డేట్ ఇచ్చారు దేవరకొండ సినిమా టైటిల్ను సంక్రాంతి తర్వాత ప్రకటిస్తామని, తెలిపారు.
అలాగే 2029 ఎన్నికలకు ముందు పోస్టర్ హీరోతో భారీ బడ్జెట్ పెట్టి పొలిటికల్ సినిమా తీస్తున్నానని ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు.

ఈ సమయంలో కిరణ్ అబ్బవరం కామెంట్స్ పై స్పందిస్తూ.. ఒక సాఫ్ట్ థింగ్ ఏంటంటే.. కిరణ్ ఒక సంవత్సరం కష్టపడి సినిమా తీశారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ తన బాధను వ్యక్తపరిచాడు. తన క మూవీకి మంచి రెస్పాండ్ వస్తుందని అన్నారు.పాజిటివ్‌ టాక్‌ అందుకుంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అందుకు సంతోషించాల్సింది పోయి.. కాంపిటీషన్ పెట్టుకొని ఏం సాధిస్తాం? చెప్పండి అంటూ నాగ వంశీ ప్రశ్నిస్తారు. తనకు కిరణ్ కు సెట్ అయితే ఓ మూవీ తీయాననీ ఎవరైనా చెప్పారా? మా ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా?' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Lucky Bhasker movie producer Naga Vamshi made shocking comments on hero Kiran Abbavaram Controversy

ఇంతకీ కిరణ ఏమన్నారంటే..?

క మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్స్ మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిగట్టుకుని కొందరు తనపై ట్రోలింగ్ చేస్తున్నారని, ఎక్కడో మారుమూల గ్రామానికి పుట్టిన తాను.. సినిమాల్లో నటించడమే పెద్ద ఓ విజయం అన్నారు. నాతో మీకు ప్రాబ్లం ఏంటీ..? కిరణ్ అనే వాడు ఎదగకూడదా అని ఆయన ప్రశ్నించారు. తాను నటించిన 8 సినిమాల్లో నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయనీ,తాను ఫెయిల్యూర్ యాక్టర్‌ని కాదని కిరణ్ అన్నారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆఫీస్ ఉందని, వాళ్ల సినిమాల్లో తనని ట్రోల్ చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. నా కోసం , కుటుంబం కోసం అమ్మ ఎంతో కష్టపడిందని, దుబాయ్ వెళ్లి.. తనని చదివించిందని, సినిమాలలో తానేంటో నిరూపించుకుని అమ్మ సంతోషపడేలా చేయాలని అనుకున్నానని కిరణ్ తెలిపారు. తాను తన సినిమా విషయంలో ఎక్కడ, ఎప్పుడూ తగ్గలేదని.. హిట్స్, ఫ్లాప్స్ అనేవి ప్రతి నటుడి జీవితంలో కామన్ అని కిరణ్ అన్నారు. కానీ ప్రతి విషయంలో తనని ట్రోల్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X