Don't Miss!
- News
Budget 2023: మొత్తం బడ్జెట్లో 13 శాతం వాటా ఈ రంగానిదే..!!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సోహెల్ పక్కా కమర్షియల్ హీరో.. అతడి ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు.. లక్కీ లక్ష్మణ్ నిర్మాత హరిత ఎమోషనల్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో ప్రేక్షకులకు చేరువైన సయ్యద్ సోహెల్ ర్యాన్ తాజాగా నటించిన చిత్రం లక్కీ లక్ష్మణ్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. మోక్ష ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది. హరిత గోగినేని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి ఏఆర్ అభి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే డిసెంబర్ 31వ తేదీన విడుదలవుతున్న కొర్రమీను సినిమా యూనిట్ లక్కీ లక్ష్మణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హోస్టింగ్ చేయడం విశేషంగా మారింది. కంటెంట్ ప్రధానంగా వస్తున్న కొర్రమీను, లక్కీ లక్ష్మణ్ చిత్రాల యూనిట్స్ ఒకరికొకరు ప్రమోషన్స్ చేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సోహెల్ మాట్లాడుతూ..
నా సక్సెస్‌కు ప్రధానమైన కారణం తెలుగు ప్రజలే. నా సక్సెస్ వెనుక నా తండ్రి ఎనలేని కృషి ఉంది. నాకు సినిమా, స్వచ్చంద సేవ తప్ప మరోటి నాకు తెలియదు. నా నిర్మాత హరిత గారు ఈ సినిమా సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఆమె డేరింగ్, డాషింగ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాను రూపొందించిన అభి టాలెంటెడ్ దర్శకుడు. కంటెంట్ పవర్‌ను నమ్ముకొని ఈ సినిమాను చేశాం. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. రాజా రవీంద్ర, షానీ, దేవీ ప్రసాద్ పాత్రలు మిమ్మల్ని ఎమోషన్‌కు గురిచేస్తాయి. తెలుగు ప్రజలే నా బలం. వాళ్లే నా సినిమాను ముందుకు తీసుకెళ్తారు. నాకు సపోర్ట్ చేసి ఆశీర్వదించండి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సూపర్బ్‌గా ఉంది. మా సినిమా 30వ తేదీన రిలీజ్ అవుతున్నది. థియేటర్లలో ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి అని సోహెల్ అన్నారు.

నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. దేవుడు దయ వల్ల ఇలా మీ ముందు నిలుచున్నాం. దేవుడిపై మాకు గట్టి నమ్మకం ఉంది. దర్శకుడు అభి సినిమా అంటే తపన ఉన్న వ్యక్తి. అతడి కలలను సాకారం చేయాలనే ప్రయత్నంతోనే.. నాకు సాధ్యమైనంత వరకు ప్రోత్సాహం అందించాను. మేము చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ సినిమాకు అత్యంత బలం. హీరోయిన్ మోక్ష మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రతీ క్యారక్టర్ ప్రాధాన్యం ఉంటుంది. సోహెల్ చాలా మంచి మనసున్న వ్యక్తి. చాలా కష్టపడి పనిచేస్తుంటాడు. చాలా ఎమోషన్స్ ఉన్న వ్యక్తి. అతడు పక్కా కమర్షియల్ హీరో అని నిర్మాత హరిత పొగడ్తలతో ముంచెత్తారు.
సినిమా అంటే నాకు ప్యాషన్. నాకు ఎప్పుడూ ప్రోత్సాహం అందించే తండ్రి కడుపున పుట్టడం అదృష్టం. నేను ఎలాంటి తప్పు చేసినా ఎప్పుడూ కరెక్ట్ చేస్తుంటాడు. టీజర్లు, ట్రైలర్లు మా సినిమా ఏంటో ఇప్పటికే చెప్పేశాయి. నేను కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌లో కథ చెప్పేశాడు. మా సినిమాకు అనూప్ మ్యూజిక్ బిగ్ అసెట్. సోహెల్ ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అయినా తన చుట్టూ ఉండే పేద ప్రజలకు ఎప్పుడూ సాహసం చేస్తుంటాడు. మంచి హృదయం ఉన్న వ్యక్తి అని దర్శకుడు అభి అన్నారు.