Kalki 2898 AD: రిలీజ్‌కు ముందు కల్కి మూవీకి షాక్.. హైకోర్టులో పిటీషన్ దాఖలు
తెలుగు సినిమా పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను, మార్కెట్‌ను సొంతం చేసుకున్న వాళ్లు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న అతడు.. ప్రతి సినిమాతోనూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి విడుదలకు ముందే బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన సినిమానే 'కల్కి 2898 ఏడీ'. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కించారు. దీనికితోడు ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్లు కూడా ఉండడంతో ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది.

టైం ట్రావెల్ కథతో టెక్నికల్ వండర్‌గా రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీని జూన్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. ఇక, ఈరోజు సాయంత్రమే విదేశాల్లో ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు అమలులో ఉన్న టికెట్ రేట్లకు సింగిల్ స్క్రీన్స్‌లో 100, మల్టీప్లెక్స్‌లో 75 వరకు పెంచుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో చిత్ర యూనిట్, బయ్యర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌లో 'కల్కి 2898 ఏడీ' సినిమాకు టికెట్ రేట్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ నమోదు అయింది. టికెట్ రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని పిటీషనర్లు కోరినట్లు తెలుస్తోంది. దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబోలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, మాళవిక నాయర్, శోభనలు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











