లస్ట్ స్టోరీస్: దానికీ సిద్దమైన ఈషా రెబ్బా! అందాలతో రచ్చ.. అందరి కళ్ళు దానిపైనే!

తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఇక రూటు మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా సక్సెస్ అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలతో రచ్చ చేసేందుకు సిద్ధమైందని టాక్. ఈ మేరకు 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ తెలుగు వర్షన్ సెట్స్ మీదకొచ్చేసింది ఈషా. ఆ వివరాలేంటో చూద్దామా..

చాలా అరుదు కానీ ఈషా మాత్రం!

చాలా అరుదు కానీ ఈషా మాత్రం!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ హీరోయిన్లు కనిపించడం చాలా అరుదుగా మారింది. అప్పట్లో ఇక్కడి వాళ్లనే హీరోయిన్లుగా తీసుకున్న సినీ నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో వెండితెరపై తెలుగు హీరోయిన్ల మెరుపులు కరువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం పోటీని తట్టుకుని నెట్టుకు వస్తోంది ఈషా రెబ్బా.

అంతకుముందు ఆ తర్వాత.. ఈషా రెబ్బా

అంతకుముందు ఆ తర్వాత.. ఈషా రెబ్బా

‘అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈషా రెబ్బ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ ఉన్నా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు దొరకడం లేదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ'లో అవకాశం వచ్చినా.. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత కనిపించక ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.

అవకాశాల వేట.. దానికీ సిద్దమే!

అవకాశాల వేట.. దానికీ సిద్దమే!

అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కితగ్గని ఈ తెలుగమ్మాయి.. అవకాశాల వేట కొనసాగిస్తూనే ఉంది. ఈ మేరకు కథ డిమాండ్ చేయాలి గానీ అందాలను ఆరబోయడానికి, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి సిద్దమే అని అంటోంది.

కన్నేసిన ఈషా.. అద్భుతమైన అవకాశం

కన్నేసిన ఈషా.. అద్భుతమైన అవకాశం

ఈ పరిస్థితుల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ రంగం వైపు కన్నేసింది ఈషా రెబ్బా. అంతేకాదు ఓ అద్భుతమైన అవకాశాన్నీ పట్టేసింది. హిందీ వర్షన్‌లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్'లో నటించేందుకు రెడీ అయిపోయింది.

స్వయం తృప్తి పొందుతూ.. బోల్డ్ సీన్స్

స్వయం తృప్తి పొందుతూ.. బోల్డ్ సీన్స్

'లస్ట్ స్టోరీస్' హిందీ వర్షన్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. ఇందులో స్వయం తృప్తి పొందే గృహిణిగా నటించిన ఈ బ్యూటీ బోల్డ్ సన్నివేశాలతో యువతకు మాంచి కిక్కిచ్చింది. ఓ రకంగా ఈ వెబ్ సిరీస్ కియారా పాపులారిటీని అమాంతం పెంచేసింది.

నలుగురు దర్శకులు.. అతనితో ఈషా!

నలుగురు దర్శకులు.. అతనితో ఈషా!

ఇప్పుడదే 'లస్ట్ స్టోరీస్' తెలుగులో రూపొందుతోంది. దీనికి నలుగురు దర్శకులు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తరుణ్‌ భాస్కర్, నందినీ రెడ్డి, ఘాజీ ఫేం సంకల్ప్‌ రెడ్డిలు ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే తరుణ్‌ భాస్కర్ ఎపిసోడ్‌లో ఈషా నటిస్తున్నట్లు తెలిసింది.

హాట్ ఫోజు.. అందరి కళ్ళు దానిపైనే!

హాట్ ఫోజు.. అందరి కళ్ళు దానిపైనే!

ఈ మేరకు 'లస్ట్ స్టోరీస్' అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈషా. ఇందులో ఆమె యమ హాట్ లుక్‌లో దర్శనమివ్వడంతో అందరి కళ్ళు ఇప్పుడు తెలుగు 'లస్ట్ స్టోరీస్'పై పడ్డాయి.

నిత్యం టచ్ లోనే ఉండే హీరోయిన్

తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా నిత్యం టచ్ లోనే ఉండే ఈషా రెబ్బా.. ఎప్పటికప్పుడు హాట్ ఫోజులతో మత్తెక్కిస్తూనే తనను తాను యమ ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. ఈషా లుక్స్ కోసం నెటిజన్లు సైతం వేచిచూస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X