Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
శంకర్, రామ్ చరణ్ సినిమాకు ఊహించని షాక్.. కోర్టుకెక్కిన ఇండియన్ 2నిర్మాతలు
సంచలన దర్శకుడు శంకర్ కు లైకా ప్రొడక్షన్ హౌజ్ షాక్ ఇచ్చింది. ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయకుండానే మరో సినిమాను స్టార్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాస్ హై కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కారణంగా రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమాకు బ్రేకులు పడేలా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంత బడ్జెట్ పెట్టినా కూడా
దర్శకుడు శంకర్ ఒకప్పుడు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకునేవి. ఎంత బడ్జెట్ పెట్టినా కూడా మినిమమ్ గ్యారెంటీ అనేలా సినిమాలు తీసేవారు. అయితే ప్రస్తుత కాలంలో శంకర్ చేస్తున్న సినిమాలు అనుకున్నంత స్థాయిలో హిట్టవ్వడం లేదు. ఆ ఎఫెక్ట్ తదుపరి సినిమాలపై కూడా పడుతోంది.
కమల్ తో ఇండియన్ 2
అసలు మ్యాటట్ లోకి వస్తే కమల్ హాసన్ తో ఇండియన్ 2 ప్రాజెక్టును స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఆ సినిమాను మొదట్లో 300కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలని అనుకున్నారు. అయితే ఆ సినిమాకు మధ్యమధ్యలో అనుకోని విధంగా బ్రేకులు పడ్డాయి.
వాయిదా పడిన షూటింగ్
బడ్జెట్ విషయంలో నిర్మాతలకు శంకర్ మధ్య అనేక సార్లు చర్చలు జరిగాయి. ఇక మొత్తానికి శంకర్ ను ఒప్పించి 230కోట్లల్లో సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే ఆ మధ్యలో ఒక యాక్సిడెంట్ తో పాటు లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక శంకర్ కు రెమ్యునరేషన్ బ్యాలెన్స్ కూడా పూర్తిగా ఇవ్వలేదట.
శంకర్ కు నోటీసులు
అయితే శంకర్ ఇండియన్ 2ను పక్కనపెట్టి రామ్ చరణ్ తో కొత్త సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే శంకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ లైకా ప్రొడక్షన్ కోర్టును ఆశ్రయించింది. 230కోట్ల బఫ్జెట్ లో ఇప్పటికే సినిమాకు 180కోట్లు ఖర్చు చేశారని, అయితే మిగతా రెమ్యునరేషన్ ను డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరణ ఇచ్చారు. ఇక వీలైనంత త్వరగా ఇండియన్ 2షూటింగ్ ను స్టార్ట్ చేయాలని వారి నుంచి డిమాండ్ వస్తోంది. ఇక హై కోర్టు శంకర్ సమాధానం కోసం నోటీసులు పంపినట్లు సమాచారం.