Devara : వేలు పెట్టకుంటే రిజల్ట్ ఇలా ఉంటది .. దేవర సక్సెస్‌మీట్‌లో స్టార్ రైటర్ షాకింగ్ కామెంట్స్
కొరటాల శివ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలు పోషించిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో విజయవంతంగా దూసుకెళ్తోంది. ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్‌తో ఎన్టీఆర్ కెరీర్‌లోయే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ విజయం హీరో ఎన్టీఆర్ కంటే కొరటాల శివకు అత్యంత కీలకం. దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలని ఎంతో కసితో ఆయన ఈ సినిమా తీశారు. ఈ నేపథ్యంలో దేవర సక్సెస్‌మీట్‌లో స్టార్ రైటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ వివరాల్లోకి వెళితే..
మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి నాలుగు వరుస బ్లాక్ బస్టర్స్‌తో జోరు మీదున్న కొరటాల ఇండస్ట్రీలో ఓటమి అనేది ఎరుగని దర్శకుడిగా నిలిచారు. ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు వెయింటింగ్. అలాంటి టైంలో ఆచార్య సినిమా కొరటాల స్పీడుకు బ్రేకులు వేసింది. మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కిన ఆ సినిమా మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుని భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

ఎన్నో అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులను ఆచార్య మెప్పించలేకపోయింది. ఈ షాక్ నుంచి మెగా అభిమానులు బయటకు రాలేకపోయారు. ఆ వెంటనే కొరటాలను టార్గెట్ చేశారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరిగింది. అయితే కొరటాలను సపోర్ట్ చేసేవారు లేకపోలేదు. మెగా కాంపౌండ్ వేలు పెట్టడం వల్లనే సినిమాకు అలాంటి రిజల్ట్ వచ్చిందని కామెంట్స్ పెట్టారు. కొద్దిరోజులకు ఈ ఇష్యూ సద్దుమణిగిపోయింది..
ఇలాంటి దశలో ఎన్టీఆర్‌తో మరోసారి జతకట్టిన కొరటాల శివ దర్శకుడిగా నిలబడటంతో పాటు ఓ సాలీడ్ హిట్ కొట్టి విమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో కొరటాల మాట్లాడుతూ.. మన పని మనల్ని చేసుకోనిస్తే రిజల్ట్ వేరేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఆయన పరోక్షంగా చిరంజీవిపై కామెంట్స్ చేశాడని మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇంతలో సెప్టెంబర్ 27 రానే వచ్చి దేవర రిలీజైంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా వెళ్తోంది సినిమా.
సినిమాకు హిట్ టాక్ రావడంతో దేవర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన ఆయన ఎవరి పనిని వారు చేసుకోనిస్తే విజయం ఇలా ఉంటదన్నారు. దర్శకుడిని హీరో నమ్మితే విజయం మరింత బలంగా ఉంటుందని దేవర రుజువు చేసింది. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా చిరంజీవిపై చేసినవేనంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇది కాస్త వివాదంగా మారుతుండటంతో శాస్త్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన వ్యాఖ్యలు ఏటో దారి తీస్తున్నాయని.. తన ఉద్దేశం కొరటాల శివ తన టెక్నీషియన్స్‌కి ఫ్రీ హ్యాండ్ ఇస్తారని .. అంతే తప్ప విపరీతార్ధాలు తీయొద్దని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన వివరణతో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేక కొత్త టర్న్ తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











