పవర్ స్టార్‌పై RGV సినిమా.. హర్టయిన సీనియర్ రచయిత.. మరో మణిరత్నం అనుకుంటే..

దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఆర్జీవి అంటే ఎంతో మందికి ఒక స్ఫూర్తి అని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చెబుతుంటారు. అయితే ఆయన ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న సినిమాలు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇక పవర్ స్టార్ పై సినిమా తీస్తున్నట్లు ఇటీవల ఎనౌన్స్ చేయడంపై ఒక రచయిత డిఫరెంట్ గా స్పందించారు.

Recommended Video

Power Star పై Ram Gopal Varma మూవీ.. నలుగురు పిల్లలు, 8 బర్రెలతో పాటు వర్మ కూడా! || Oneindia Telugu
పవర్ స్టార్ టైటిల్..

పవర్ స్టార్ టైటిల్..

పవర్ స్టార్ టైటిల్ తో ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన వర్మ లుక్ కూడా రిలీజ్ చేశాడు. అలాగే సినిమాలో పాత్రలకు సంబంధించిన వివరాలను కూడా చెబుతూ.. నలుగురు పిల్లలు, ఒక రష్యన్ యువతి, అలాగే 8 బర్రెలు సినిమాలో ఉంటాయని వ్యంగ్యంగా ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని పవన్ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఒక మణిరత్నం అనుకున్నాం..

ఒక మణిరత్నం అనుకున్నాం..

ఇక ఆ విషయంపై కాస్త ఇన్ డైరెక్ట్ గా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి స్పందించారు. డైరెక్ట్ గా కాకుండా ప్రస్తుతం వర్మ నడుస్తున్న తీరుపై ట్వీట్ చేశారు. 'ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం...మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్....మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు..తెలివిగా ఎదో చెప్పేస్తారు...నేను హర్ట్' అని వివరణ ఇచ్చారు.

వర్మ ఆన్సర్ ఇస్తాడా..?

వర్మ ఆన్సర్ ఇస్తాడా..?

సాధారణంగా రామజోగయ్య శాస్త్రి ఇలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్ళరు కానీ.. వర్మ వ్యవహరిస్తున్న తీరుకు ఆయన ఆలోచనను ఈ విధంగా చెప్పక తప్పలేదు. అయితే ఈ సీనియర్ రచయిత చేసిన ట్వీట్ కి వర్మ ఎలాంటి రిప్లై ఇస్తాడో అని ఆడియేన్స్ ఎదురుచూస్తున్నారు. నైట్ కి మంచి రిప్లై వస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకు అలాంటి సినిమాలు చేస్తున్నారు?

ఎందుకు అలాంటి సినిమాలు చేస్తున్నారు?

ఇక రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్లైమాక్స్, నగ్నం అంటూ దాదాపు బి గ్రేడ్ సినిమాలను దింపేస్తున్నాడు. గతంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన ఆర్జీవి సడన్ గా ఇలాంటి మసాలా సినిమాల వైపు మళ్లడం ఇండస్ట్రీలో కొందరిని అసంతృప్తికి గురి చేస్తోంది. ఇక పవర్ స్టార్ సినిమా అనంతరం వర్మ ఇంకా ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X