PSPK28: పవన్ కోసం సుజిత్ హిట్ సెంటిమెంట్.. ఫ్యాన్స్ కోరినట్లు కాకుండా!
ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ యమ జోష్‌తో దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అదే సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల చాలా నెమ్మదిగానే షూటింగ్‌లలో పాల్గొంటూ వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మరో కొత్త ప్రాజెక్టును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే 'హరిహర వీరమల్లు' షూటింగ్‌లో పాల్గొంటోన్న పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలను అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సాహో' ఫేం సుజిత్‌తో కూడా ఓ ప్రాజెక్టును రెండు రోజుల క్రితమే ప్రకటించాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, OG (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) అంటూ సినిమాపై ఓ హిట్ కూడా ఇచ్చేసింది. ఇక, ఇందులో పవన్ కల్యాణ్ గన్ పట్టుకుని నిల్చున్న స్టిల్ చూపించగా.. దాని నీడ మాత్రం ఓ పెద్ద గన్‌లా కనిపించడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు పని చేయబోయే మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా ప్రచారాలు మొదలయ్యాయి. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకోమని రిక్వెస్టులు చేస్తున్నారు. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కోసం జిబ్రాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. గతంలో సుజిత్ తెరకెక్కించిన 'రన్ రాజా రన్' చిత్రానికి అతడే మ్యూజిక్ ఇచ్చాడు. అది హిట్ అవడంతో ఇప్పుడు మళ్లీ అతడిని సెలెక్ట్ చేసినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించబోయే సినిమాను వచ్చే జనవరిలో మొదలు పెట్టబోతున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని కేవలం ఆరు నెలల లోపే పూర్తి చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications










