Manchu Vishnu: "నటి హేమపై అసత్య ప్రచారాలు ఆపండి.. అదే జరిగితే కఠిన చర్యలు తప్పవు"

ఇటీవలే బెంగళూరులో రేవ్ పార్టీ జరగడం.. తెలుగు సినీ రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు అందులో ఇరుక్కున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పార్టీలో నటి హేమ పాల్గొందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవం అని తాను రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ హేమ వీడియో రిలీజ్ చేసింది.

కానీ అదంతా తప్పు అని ఆమె పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆమె డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు కన్ఫార్మ్ చేశారు. ఈక్రమంలోనే అనేక మంది నటి హేమను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు. నటి హేమకు సపోర్ట్ చేస్తూ.. ట్వీట్ చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Maa Association President And Hero Manchu Vishnu Tweet About Hema on Rave Party Issue

రేవ్ పార్టీ వ్యవహారంలో.. అనేక మంది తెలుగు సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు, మోడల్స్ హాజరైనట్లుగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు నటి హేమ, హీరో శ్రీకాంత్ వంటి వాళ్లు పాల్గొన్నట్లు తెలిసింది. కానీ వీరిద్దరూ తాము ఇంట్లోనే ఉన్నట్లుగా వీడియోలు విడుదల చేశారు. శ్రీకాంత్ తన ఇంటిని కూడా చూపించారు. కానీ నటి హేమ మాత్రం తాను ఓ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. రేవ్ పార్టీకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది. కానీ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆమె ఆ పార్టీలో పాల్గొందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టెస్టులు చేయగా.. ఆమె డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.

అయితే ఈ ఘటనపై తాజాగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు. ముఖ్యంగా అందరూ షాక్ అయ్యేలా నటి హేమకు సపోర్ట్ చేశారు. ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలను రాసుకొచ్చారు. ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు నటి శ్రీమతి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. అలాగే నిజం ఏంటో తెలియకముందే... అసత్య ప్రచారాలను ప్రచారం చేయడం మానుకోవాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.

శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా భావించబడాలని ఎక్స్ వేదికగా మంచు విష్ణు వెల్లడించారు. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని ఆమెకు కూడా కుటుంబం ఉందంటూ చెప్పుకొచ్చారు. అలాగే పుకార్లను ఆధారంగా చేసుకుని ఆమెను దూషించడం అన్యాయం అని వివరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను కచ్చితంగా ఖండిస్తుందని.. అయితే శ్రీమతి హేమకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలను పోలీసులు అందజేస్తే, MAA తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

అయితే అప్పటి వరకు ఎవరూ నటి హేమపై తప్పుడు, అసత్య వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. అలాగే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ.. ట్రోల్స్ చేయడం సరికాదన్నారు. ఇలాంటి వాటి వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది కల్గకూడదని.. నేరం రుజువు అయ్యాకే వాటి గురించి మాట్లాడాలంటూ చెప్పుకొచ్చారు. చూడాలి మరి మరికొన్ని రోజుల్లో విచారణకు హాజరు కాబోతున్న నటి హేమ తప్పు చేసినట్లు నిర్ధారణ అవుతుందా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X