MAA Elections: ఒక్కొకరికి ఒక్కో పదవే.. వారికి నో ఛాన్స్.. ఆసక్తికరంగా రూల్స్!

చాలా రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా కొన్ని ఆసక్తికర రూల్స్ కూడా ప్రకటించారు ఎన్నికల అధికారి. ఆ వివరాల్లోకి వెళితే

రచ్చ రచ్చ

రచ్చ రచ్చ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రకటన ముందు నుంచి అనేక సంచలనాలు, సంచలన ప్రకటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికలను తలపిస్తూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో మీడియా కూడా ఈ అంశం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల అక్టోబర్ 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నట్లుగా గత మీటింగ్లో తేలిన సంగతి తెలిసిందే.

10వ తేదీన

10వ తేదీన

అయితే తాజాగా ఎన్నికల సరళి, ఎన్నికల నియమ నిబంధనలు, ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అనే అంశాల మీద ఎన్నికల అధికారి క్లారిటీ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2021 - 2023 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. అక్టోబర్ 10వ తేదీన ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఈ పోలింగ్ జరగబోతున్నట్టుగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్ 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.

నామినేషన్లు ఎప్పటి నుంచంటే

నామినేషన్లు ఎప్పటి నుంచంటే


ఈ ఎన్నికలకి సంబంధించి ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తారీకు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అని ఆయన ప్రకటించారు. స్వీకరించిన నామినేషన్ల నీటి 30వ తేదీన పరిశీలిస్తామని ఆ పరిశీలన తర్వాత నామినేషన్ ఉపసంహరణకు అక్టోబర్ ఒకటో తారీకు రెండో తారీకు సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇస్తామని వెల్లడించారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పరిశీలన జరిపి రెండో తేదీ సాయంత్రం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

రూల్స్ గట్టిగా

రూల్స్ గట్టిగా


ఇక పోలింగ్ అక్టోబర్ 10వ తేదీన జరగబోతుండగా అదే రోజు రాత్రి ఏడు గంటల తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి పలు నియమ నిబంధనలు కూడా కృష్ణమోహన్ ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్న ఏ అభ్యర్థి అయినా ఏ పదవికి అయినా పోటీ చేయవచ్చని కానీ ఒక అభ్యర్థి ఒక పదవికి మాత్రమే పోటీ చేయాలని వెల్లడించారు. అయితే గత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉండి 50 శాతం కన్నా తక్కువ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లకు హాజరు కాకపోతే వారికి పోటీ చేసే అర్హత ఉండదని పేర్కొన్నారు. ఇక ఇరవై శాఖల అసోసియేషన్స్ లో ఆఫీస్ బేరర్స్ గా ఉన్నవారు పోటీ చేయాలి అనుకుంటే ఆ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని లేకపోతే ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉండదు అని ప్రకటించారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Deepthi Sunaina's Romantic Wish - Shanmukh Emotional || Filmibeat Telugu
ఇప్పటికి ముగ్గురు

ఇప్పటికి ముగ్గురు


ఇక ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, cvl నరసింహ రావు పోటీ పడుతూ ఉండగా కాదంబరి కిరణ్ కూడా తాను ఎన్నికలలో నిలబడతానని అన్నారు కానీ తరువాత ఎక్కడా ప్రకటన చేసిన దాఖలాలు లేవు. ముందు నుంచి అధ్యక్ష బరిలో దిగుతామని ప్రకటించిన హేమ, జీవిత రాజశేఖర్ చివరికి ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇవ్వడంతో ముగ్గురు ప్రధాన అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు గా అయింది. అయితే మంచు విష్ణు ఇంకా తన ప్యానల్ ప్రకటించకపోగా ప్రకాష్ రాజు ప్యానల్ ప్రకటించడమే కాక విందులు, సమావేశాలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులలో విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X