twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA Elections డేట్ ఫిక్స్.. మూడు డేట్లు చెబితే.. ఆ మూడు కాదని మరీ ఆరోజునే?

    |

    గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లోనే కాక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయం మీద పెద్ద ఎత్తున సందిగ్ధత నెలకొంది. అయితే నిన్న జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా దీనిమీద ఒక క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఇక డేట్ కూడా ఫిక్స్ అయిందని త్వరలోనే అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.

    వివాదస్పదంగా

    వివాదస్పదంగా

    ప్రతి సారి లాగే ఈ సారి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చాలా పెద్ద ఎత్తున వివాదస్పదంగా మారాయి. అసలు ఎన్నికల తేదీ కూడా ప్రకటించకుండానే పోటీ చేస్తున్న అనుకుంటున్న అభ్యర్థుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సర్వసభ్య సమావేశం వీడియో కాల్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న వారు హాజరయ్యారు.. ఇక ఈ సమావేశం లో ఎన్నికల తేదీ గురించి అనేక చర్చోపచర్చలు జరిగాయి.

    భిన్నాభిప్రాయాలు

    భిన్నాభిప్రాయాలు

    సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని కోరగా మరికొందరు అక్టోబర్ నెలలో నిర్వహించాలని కోరారు.. అయితే సభ్యులు అందరి వాదనలు విన్న క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అలాగే మురళీమోహన్ ఇద్దరూ కూడా వారం రోజుల్లో ఎన్నికల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కూడా క్రమశిక్షణా సంఘం ఏది చెబితే అది చేస్తామని దానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అయితే ఎన్నికల తేదీ ఎప్పుడు ఉండవచ్చు అనే విషయం మీద ఇప్పుడు చర్చ మొదలైంది.

    లెక్క ప్రకారం ఇరవై ఒక్క రోజుల లోగా

    లెక్క ప్రకారం ఇరవై ఒక్క రోజుల లోగా

    వార్షిక జనరల్ బాడీ మీటింగ్ జరిగిన ఇరవై ఒక్క రోజుల లోగా ఎన్నికలు జరపాలి అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిలాస్ లో ఉంది. ఇక నిన్న మాట్లాడిన సభ్యులు మూడు డేట్లను ప్రతిపాదించారు.. అందులో ఒకటి సెప్టెంబర్ 12వ తేదీ కాగా మరొకటి సెప్టెంబర్ 19వ తేదీ అలాగే మరో తేదీ సెప్టెంబర్ 26. అయితే సెప్టెంబర్ 12వ తేదీ అయితే మరీ దగ్గర అయిపోతుందని లేదు సెప్టెంబర్ 29వ తేదీ చేయాలంటే ఆ రోజు గణేష్ నిమజ్జనం జరుగుతోందని అంటున్నారు.

    కష్టమే కానీ ఆరోజే

    కష్టమే కానీ ఆరోజే


    అయితే 21 రోజుల్లో నిర్వహించడం ప్రస్తుతం సాధ్యం కాదని మురళీమోహన్ చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని సెప్టెంబర్ రెండవ వారం నుంచి అక్టోబరు రెండవ వారం లోపు ఎప్పుడు వీలుగా ఉంటుందో చూసి అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.

    Recommended Video

    MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
    అధికారిక ప్రకటన త్వరలో

    అధికారిక ప్రకటన త్వరలో

    ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో..

    English summary
    The Annual General Body Meeting (AGM) of MAA was held yesterday. And decided to conduct MAA Election on september 26th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X