twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నలుగురు మగాళ్లను ఓడించా, ఇక తీన్మారే: ‘మా’ ఎన్నికల్లో విజయంపై హేమ

    |

    తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఉత్కంఠ భరితంగా ముగిసాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ జరుగింది. ఈ సారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి.

    ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ ఘన విజయం సాధించింది. అయితే ఈ రెండు ప్యానల్స్ నుంచి కాకుండా స్వతంత్రంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నటి హేమ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.

    నలుగురు మగాళ్లను ఓడించా

    నలుగురు మగాళ్లను ఓడించా

    తన గెలుపు అనంతరం హేమ మాట్లాడుతూ... నలుగురు మగాళ్లను ఓడించి అత్యధిక మెజారిటీతో గెలుపొందాను. ‘మా'ను ప్రగతి పథంలో నడిపించడమే తన లక్ష్యమని, అందుకే తాను స్వతంత్ర్యంగా పోటీ చేసినట్లు తెలిపారు.

    తీన్మార్ వేసేదాన్ని

    తీన్మార్ వేసేదాన్ని

    ఈ విజయం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎంత సంతోషంగా ఉందంటే.. ఇక్కడ దరువు ఉంటే తీన్మార్ డాన్స్ చేసేదాన్ని. ఇది ఇండస్ట్రీలో ఉన్న ఆడవారి అందరి విజయంగా భావిస్తున్నాను. వారి సపోర్ట్ లేకుంటే నా విజయం సాధ్యమయ్యేది కాదని హేమ అన్నారు.

    కొడుకు మాట విన్నందుకు 90 కోట్లు.. అక్షయ్‌‌ను వెంటాడిన అదృష్టం!కొడుకు మాట విన్నందుకు 90 కోట్లు.. అక్షయ్‌‌ను వెంటాడిన అదృష్టం!

    నిద్రపోను

    నిద్రపోను

    ‘మా'కు మేము ఏదైతే చేస్తామని మాట ఇచ్చానో అది చేసే వరకు నిద్రపోను. అందరినీ న్యాయం జరిగేలా కమిటీలో నా గళం వినిపిస్తాను అని ఈ సందర్భంగా హేమ చెప్పుకొచ్చారు.

    నరేష్ ప్యానల్ విజయం

    నరేష్ ప్యానల్ విజయం

    ఈ ఎన్నికల్లో గత అధ్యక్షుడు శివాజీ రాజాను సపోర్ట్ చేస్తూ ఒక ప్యానల్.... నరేష్‌ను అధ్యక్షుడిగా గెలిపించుకుందామని ఒక ప్యానల్ హోరాహోరీగా తలపడ్డారు. ఈ పోటీలో నరేష్ ప్యానల్ విజయం సాధించింది. నరేష్ ప్రెసిడెంట్‌గా, రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జీవిత జరనల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.

    English summary
    Actress Hema Excited about MAA Elections Victory. She has been elected as vice president of MAA. Naresh panel has won the Movie Artistes Association (MAA) elections 2019. Naresh emerged as winner with more number of votes for President post whereas Sivaji Raja contested as opponet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X