twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA Elections 2021: ముఖం చాటేసిన అగ్రహీరోలు, హీరోయిన్లు.. ఎవరెవరూ ఓటు వేయలేదంటే?

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు, వాడివేడి కామెంట్లు, ఘర్షణ వాతావరణం మధ్య జరిగాయి. ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ జోరుగా ప్రచారం చేయడంతో ఈ ఎన్నికలు వివాదాస్పదంగా మారడమే కాకుండా మరింత ఆసక్తిగా మారింది. అయితే భారీ అంచనాలు, ఊహాగానాల మధ్య ఎన్నికలు గొడవల మధ్య కొనసాగాయి. అయితే అగ్రనటులు ఓటింగ్‌కు ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది. ఎవరెవరూ ఓటింగ్‌కు హాజరు కాలేదంటే..

    900 మందికిపైగా ఓటర్లు

    900 మందికిపైగా ఓటర్లు

    మా ఎన్నికల్లో మొత్తం 900 మందికిపైగా సభ్యులు ఉన్నారు. అందులో 800 మందికిపైగా చెల్లుబాటు అయ్యే ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం నాలుగు గంటలకు పోలింగ్ పూర్తి అయింది. రాత్రి 9 గంటల లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతున్నాయి.

    ఓటు హక్కు వినియోగించుకొన్న ప్రముఖులు

    ఓటు హక్కు వినియోగించుకొన్న ప్రముఖులు

    జూబ్లిహిల్స్‌లోని ప్రముఖ విద్యాసంస్థలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల కార్యవర్గానికి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయాన్నే మోహన్ బాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, బాలకృష్ణ, రాంచరణ్, నాగార్జున, అఖిల్, నిఖిల్, రాజ్ తరుణ్, బండ్ల గణేష్, శివాజీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకొన్నారు.

    హీరోయిన్లలో ఎవరు ఓటు వేశారంటే..

    హీరోయిన్లలో ఎవరు ఓటు వేశారంటే..

    ఇక హీరోయిన్లలో జెనీలియా ముంబై నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకొన్నారు. నిత్య మీనన్, అనుపమ పరమేశ్వరన్, మెహ్రీన్, స్నేహా ఉల్లాల్, ప్రియమణి, ప్రగతి, అనితా చౌదరీ, కృష్ణవేణి, రాశీ, అమని, ఇంద్రజ, తదితరులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే హైదరాబాద్‌లో ఉండి కూడా కొందరు అగ్రహీరోయిన్లు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

    ముఖం చాటేసిన స్టార్ హీరోలు..

    ముఖం చాటేసిన స్టార్ హీరోలు..

    మా ఎన్నికల్లో ఓటు వినియోగించుకొని అగ్ర హీరోలలో మహేశ్‌బాబు,ప్రభాస్‌,అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌,వెంకటేశ్‌,రానా దగ్గుబాటి, నాగచైతన్య ఉన్నారు. విజయ్ దేవరకొండ, ఆనంద దేవరకొండ ముందస్తుగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకొనేందుకు వెళ్లగా ఓటింగ్‌కు హాజరుకాలేదు.

    Recommended Video

    Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
    ఓటు హక్కు వినియోగించుకోని రకుల్, పూజా హెగ్డే, హన్సిక

    ఓటు హక్కు వినియోగించుకోని రకుల్, పూజా హెగ్డే, హన్సిక

    ఇక హీరోయిన్లలో రకుల్‌ ప్రీత్ సింగ్,త్రిష కృష్ణన్, అనుష్క శెట్టి,ఇలియానా,హన్సిక మోత్వానీ ఓటింగ్‌కు హాజరుకాలేదు. పూజా హెగ్డే, తమన్నా భాటియా, కీర్తీ సురేష్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లు ముఖం చాటేశారు. అయితే చాలా మంది హీరోయిన్లు హైదరాబాద్‌లో ఉండి కూడా ఓటు వేయడానికి రాకపోవడంపై సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    MAA Elections 2021's Voting is going with high tension mode. Prabhas, Allu Arjun, NTR, Rashmika Mandanna, Pooja Hegde away from MAA Elections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X