MAA ఎన్నికలు రసాభాస.. శివబాలాజీ చేయి కొరికిన హేమ, తన్నుకోబోయిన సభ్యులు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ విషయంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ముందు నుంచి కూడా సభ్యులు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాగా ఈ రోజు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే నటుడు బెనర్జీని మోహన్ బాబు చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది. మరో నటుడు శివ బాలాజీని ఇప్పుడు హేమ దొరికిన ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

సంచలనాలు

సంచలనాలు

ముందు నుంచి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం ఆసక్తికరంగా మారిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈరోజు పోలింగ్ లో కూడా రెండు ప్యానల్స్ కు సంబంధించిన సభ్యులు పోలింగ్ ప్రాంతంలో హడావిడి చేస్తూ కనిపిస్తున్నారు. మీడియా కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టడంతో పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ కూడా జరుగుతోందని అనుమానాలు వ్యక్తం కాగా వెంటనే ఓటింగ్ కూడా నిలిపివేసిన పరిస్థితి కనిపించింది.

హెచ్చరిక

హెచ్చరిక

రెండు వర్గాల వారిని మీటింగ్ కు హాజరు కమ్మని కోరిన ఎన్నికల అధికారి రిగ్గింగ్ జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని, అవసరమైతే ఎన్నికల ఫలితాలు కూడా ఆపేస్తా అని హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇక ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే సీసీ ఫుటేజ్ లో పరిశీలిస్తామని ఆయన తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మా వాళ్ళు గానీ ప్రకాష్ రాజ్ ప్యానల్ వాళ్ళు కానీ రిగ్గింగ్ చేయడానికి అవకాశమే లేదని కార్డు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఉందని కరాటే కళ్యాణి చెబుతున్నారు.

మోహన్ బాబు సంచలనం

మోహన్ బాబు సంచలనం

ఇది ఇలా జరుగుతూ ఉంటే మరో పక్క ప్రకాష్ రాజ్ తన గన్ మెన్స్ ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లడం మీద మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ గన్మెన్లు బయటే ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొంది..అదే సమయంలో బెనర్జీ నచ్చజెప్పబోగా చంపేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే శివ బాలాజీ-సమీర్, శివ బాలాజీ హేమ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

కొరికిన హేమ

అయితే మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ శివబాలాజీ ని బయటకు తీసుకువచ్చి హేమ శివబాలాజీ చేతిని కొరికిందని చూపించడం ఆసక్తికరంగా మారింది. అయితే వాగ్వాదం జరిగిన సమయంలో ఆమె కొరికిందా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయి అనే దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇక మరోపక్క ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పోలింగ్ జరుగుతుందని అంటున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
హేమ మీద సీరియస్

హేమ మీద సీరియస్

సాయంత్రం ఎనిమిది గంటలకి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కాబోతున్నాడు అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఉమ్మడిగా ప్రకటించారు. అయితే ఈ రిగ్గింగ్ వ్యవహారం కూడా మరుగున పడే అవకాశం కనిపిస్తోంది కానీ హేమ మీద మాత్రం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఒకసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో కూడా ఇప్పుడు సీరియస్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X