twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐదు కోట్లకు అధిపతి ఎవరు? షాకిచ్చిన చిరంజీవి, నాగార్జున.. రెండు గ్రూపుల గుండెల్లో రైళ్లు

    |

    గతంలో మునుపెన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు వేడివేడిగా జరిగాయి. ఈ ఎన్నికల్లో శివాజీరాజా, వీకే నరేష్ వర్గాలు మా పీఠాన్ని దక్కించుకొనేందుకు రకరకాల వ్యూహాలను, ఎత్తులు, పైఎత్తులు వేశారు. ఎన్నికల ప్రచారం శాంతంగా సాగుతున్న సమయంలో హీరో రాజశేఖర్ కుటుంబాన్ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. శివాజీరాజకు శ్రీరెడ్డి మద్దతు పలకడంతో మెగా హీరోలు తలోదారి పట్టేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో ఆసక్తికరమైన విషయం చోటుచేసుకొన్నది. అదేమిటంటే..

    'మా' ఎన్నికల రచ్చ: డబ్బులు పంచుతున్నారు.. దిగజారుడుతనమా? శివాజీరాజాపై నరేష్ ఫైర్ 'మా' ఎన్నికల రచ్చ: డబ్బులు పంచుతున్నారు.. దిగజారుడుతనమా? శివాజీరాజాపై నరేష్ ఫైర్

     చిరంజీవి మద్దతు మాకేనని

    చిరంజీవి మద్దతు మాకేనని

    మెగాస్టార్ చిరంజీవిని ముందే శివాజీ రాజా వర్గంలోని శ్రీకాంత్, ఇతర సభ్యులు కలిసి మద్దతు ఆశించారు. అయితే ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి తన హుందాతనాన్ని ప్రదర్శించి గుంబనంగా ఉన్నారు. అయితే శివాజీరాజా వర్గం తమకే చిరంజీవి మద్దతు ఉందనే ధీమాను వ్యక్తం చేశారు.

     స్టాండ్ మార్చిన మెగా బ్రదర్ నాగబాబు

    స్టాండ్ మార్చిన మెగా బ్రదర్ నాగబాబు

    ఎన్నికల ప్రచారం గరంగరంగా సాగుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యవహారంతో మెగా బ్రదర్ నాగబాబు తన స్టాండ్ మార్చుకొన్నారు. దాంతో చిరంజీవి మద్దతు ఎవరికీ అనే వాదనపై తర్జనభర్జనలు మొదలయ్యాయి. మెగా హీరోల మద్దతు తమకంటే తమకే అని రెండు వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి.

    ఒకే కారులో చిరు, నాగార్జున

    ఒకే కారులో చిరు, నాగార్జున

    ఆదివారం పోలింగ్ సందర్భంగా చిరంజీవి, నాగార్జున ఒకేకారులో ఓటు వేయడానికి రావడం సినీ, మీడియా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. దాంతో ఎన్నికల సమీకరణాలు అంచనా వేయడం కూడా కష్టంగా మారింది. చిరంజీవి, నాగ్ మధ్య వ్యక్తిగత సంబంధాలే కాకుండా.. వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నాయి. దాంతో వారిద్దరూ మా అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో తమ మ్యాజిక్‌ను ప్రదర్శించే ఉంటారనే మాట వినిపిస్తున్నది.

    రెండు వర్గాల్లోనూ ఆందోళన

    రెండు వర్గాల్లోనూ ఆందోళన

    చిరంజీవి, నాగార్జున లాంటి అగ్రహీరోలు ఐక్యంగా కనిపించడంతో శివాజీరాజా, నరేష్ వర్గాల్లో ఆందోళన నెలకొన్నది. వారి మద్దతు ఎవరికుంటే వారి గెలుపు సులభం కావడంతో వారి ఓటు ఏ వర్గానికి పడిందనే విషయం చర్చనీయాంశమైంది. మా అసోసియేషన్‌లో ఫండ్స్ ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. కోటి రూపాయల నుంచి ఐదు కోట్లకు పెరగడంతో ఆ సంస్థకు అధిపతి ఎవరవుతారనే విషయం ఆసక్తిగా మారింది.

     రికార్డుస్థాయిలో పోలింగ్

    రికార్డుస్థాయిలో పోలింగ్

    గతంలో మునుపెన్నడూ లేని విధంగా మా ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. మొత్తంగా 472 ఓట్లు పోలయ్యాయి. ఇది మా హిస్టరీలోనే అత్యధికం అని మా సభ్యుడు సురేష్ కొండేటి ప్రకటించారు. అయితే ఓట్ల శాతం పెరగడం ఎవరికీ లాభమనే ఆసక్తికరంగా మారింది.

    English summary
    MAA Elections are going with hot phase in Tollywood. Mega hero Nagababu taken sensational decision to support Naresh Panel instead of Shivaji Raja Panel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X