twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA Electionsలో మరో ట్విస్ట్.. అది నిజం కాదంటూ ప్రకటన, రాజశేఖర్ కి గ్రీన్ సిగ్నల్!

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా దాదాపు ఐదుగురు బరిలోకి దిగుతామని ప్రకటించడంతో ఈ మా ఎన్నికలు సాధారణ ప్రేక్షకులలో కూడా ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా ఈ ఎన్నికల్లో ఆ వివరాల్లోకి వెళితే

    మరో ట్విస్ట్

    మరో ట్విస్ట్

    తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా సంఘానికి ఒక ప్రెసిడెంట్ అలాగే ఒక ప్యానల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సంఘం ఏర్పడిన కొత్త నుంచి మొన్నీమధ్య వరకు దాదాపు గా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అధ్యక్షులు ఎన్నికవుతూ ఉండేవారు.. కొన్నేళ్ళ క్రితం నుంచి మా అధ్యక్ష పదవికి కూడా ఎన్నికలు నిర్వహిస్తూ రావడం జరుగుతోంది. గత ఏడాది కూడా శివాజీ రాజా- నరేష్ ఇద్దరూ పోటీ పడగా అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు తర్వాత నరేష్ గెలిచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

    ప్రకాష్ రాజ్ బరిలో

    ప్రకాష్ రాజ్ బరిలో

    అంతా సజావుగా సాగుతుంది అనుకున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలలో నటుడు ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అని అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆయన ఏప్రిల్ నెలలో లేఖ రాసినా ఆ లేఖను బయటకు మాత్రం రానీయలేదు. ఆ తర్వాత ఈ లేఖ గురించి మీడియాకు పొక్కడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ దిగబోతున్నారు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో రంగంలోకి దిగిన ప్రకాష్ రాజ్ నిజంగానే పోటీలోకి దిగుతానని చెబుతూ సిని'మా' బిడ్డలు అంటూ ఒక ప్యానల్ కూడా ప్రకటించి కలకలం రేపారు.

    ఆ నలుగురు కూడా

    ఆ నలుగురు కూడా

    ఇక ఆయన లాగానే నటి హేమ, నటి- దర్శకురాలు జీవిత రాజశేఖర్ కూడా ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించారు. వీరికి తగ్గట్టుగానే మంచు మోహన్ బాబు కుమారుడు హీరో విష్ణు కూడా తాను మా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న అని ప్రకటించాడు. ఇంతలో నాగ బాబు, ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తూ ఉండడం తో ఎవరికి వారు తమకు తోచిన వారిని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ వరకు ఉంటే బాగానే ఉంది కానీ ఈ వ్యవహారం కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు వరకు వెళ్ళింది. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే సీవీఎల్ నరసింహారావు అనే నటుడు కూడా తెలంగాణ వాదంతో తాను బరిలోకి దిగుతున్న అంటూ ప్రకటనలు చేసి కలకలం రేపారు. అలా మొత్తం మీద ఈ ఎన్నికల వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీద కాక రేపింది.

    రంగంలో మా

    రంగంలో మా


    తాజాగా జూలై 29 వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించింది.. కృష్ణం రాజు అధ్యక్షతన ఈ మీటింగ్ జరగగా 2021 - 23 కాలానికి జరగాల్సింది ఎన్నికలతో పాటు అనేక అంశాలను చర్చించారు. ఆగస్టు 22వ తేదీన వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఈ సమావేశంలో ఈసీ కమిటీ నిర్ణయించింది. అంతేకాక ఇక ఎన్నికల పై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిర్ణయాన్ని వాయిదా వేసింది. అయితే ఈ విషయాన్ని ముందుగా అధికారికంగా ప్రకటించలేదు కానీ కొన్ని మీడియా సంస్థలు మా ఎన్నికలు సెప్టెంబర్ 12 వ తేదీన జరగబోతున్నాయి అని వార్తలు వెల్లడించడంతో ఇప్పుడు రంగంలోకి దిగింది. అసలు ఎలాంటి నిర్ణయం ఈసీ మీటింగ్ లో తీసుకోలేదని చెబుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

    రాజశేఖర్ కి గ్రీన్ సిగ్నల్

    రాజశేఖర్ కి గ్రీన్ సిగ్నల్


    మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గతంలో మా ఉపాధ్యక్ష పదవికి డాక్టర్ రాజశేఖర్ రాజీనామా చేశారు. అయితే ఇప్పటివరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ తాజా మీటింగ్ లో ఈ అంశం మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాని క్రమశిక్షణ సంఘం ఆమోదించింది. అయితే ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఐక్యత పెంపొందించడం కోసం ఈ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈసి సమావేశం రాజశేఖర్ ను కోరింది. అయితే రాజశేఖర్ అందుకు సుముఖంగా లేకపోవడంతో ఎట్టకేలకు ఆయన నిర్ణయాన్ని ఏకీభవిస్తూ ఆయన రాజీనామా ఆమోదించింది. అలా మొత్తం మీద ఈ ఎన్నికల వ్యవహారం మళ్లీ కాక రేపుతోంది అని చెప్పక తప్పదు. .

    Recommended Video

    MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
    అది నిజం కాదట

    అది నిజం కాదట


    నిజానికి గత కొద్ది రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు 15 మంది ఈ కృష్ణం రాజుకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని లేఖలు రాసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు భౌతికంగా కరోనా కారణంగా ఓటింగ్ వేసేందుకు పరిస్థితులు అనుకూలించని కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే బయటకు మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు రానీయడం లేదు. మరి చూడాల్సి ఉంది ఏం జరగబోతోంది అనేది.

    బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

    English summary
    The Executive Committee meeting of the Movie Artists Association (MAA) has been held in virtual mode the last week. The decisions of the meeting are not made public. but as per some news published about EC meeting came into light, so a new statement released in this aspect.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X