‘ఆయన చీర కట్టుకుని మా ముందే అలా.. సమంత రియల్ ఫైటర్’

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకు దూరంగా ఉన్నారు అగ్రనటి సమంత. హిందీలో వెబ్ సిరీస్‌లకే ఆమె పరిమితమయ్యారు. చాలా రోజుల తర్వాత సమంత తెలుగులో నటిస్తోన్న మూవీ మా ఇంటి బంగారం. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాండ్ దువ్వూరులు కలిసి నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 19న మా ఇంటి బంగారం సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్ర దర్శకురాలు నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Pawan Kalyan Review On Baramulla: బారాముల్లా మూవీపై పవన్ కళ్యాణ్ రివ్యూ
Pawan Kalyan Review On Baramulla: బారాముల్లా మూవీపై పవన్ కళ్యాణ్ రివ్యూ

మీరు మొత్తం 6 సినిమాలు తీస్తే వాటిలో 3 సమంత గారితోనే తీశారు. సమంతతో మీకు అంత అనుబంధం ఏంటీ? అని యాంకర్ ప్రశ్నించగా.. మా ఇద్దరిదీ కాస్మిక్ కనెక్షన్, అలా కుదిరింది అంతే. అందులో రెండు సినిమాలు ఆవిడే స్వయంగా ఇచ్చారు. ఓ బేబీకి కూడా సమంత గారే స్వయంగా కాల్ చేశారు. ఆ తర్వాతే సురేష్ బాబుగారిని కలిశాను. ఇప్పుడు మా ఇంటి బంగారానికి కూడా ఆవిడే పిలిచారు. ఈ సినిమాలో సమంత చీర కట్టుకుని ఫైట్స్ చేయడంపై నందినీ రెడ్డి మాట్లాడుతూ.. కొడితే 40 మంది గాల్లోకి ఎగిరిపోయే లాంటి యాక్షన్ కాదు. రియలిస్టక్ యాక్షన్.. ఈ ప్రాజెక్ట్‌కు రాజ్ నిడిమోరు గారు చాలా హెల్ప్ చేశారు. స్టోరీ ఐడియా ఆయనదే, రాజ్ గారి విజన్ కూడా అదే.. నా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయని నందినీ రెడ్డి చెప్పారు.

Maa Inti Bangaaram Samantha s Saree Fights Surprise Everyone says Nandini Reddy

ఫ్యామిలీమెన్ చూస్తే సమంత గారు లెంగ్తీ షార్ట్ చేశారు.. అది రాజ్ అండ్ డీకే గారి ట్రేడ్ మార్క్. యాక్షన్ సీన్స్ సమంత చాలా బాగా చేస్తారు. చీరలో ఫైట్స్ అనేది స్పెషల్. ఈ కథ విన్నప్పుడే కిల్‌బిల్ + కలిసుందాం రా అని రాజ్ గారితో అన్నాను. కలిసుందాం రా ఫ్యామిలీలోకి కిల్ బిల్ ల్యాండ్ అయితే ఎలా ఉంటుందో అదే కథ. ఈ స్టోరీ ఐడియా రాజ్ గారిదే. అప్పట్లో వధువు కావలెను అనే కాలమ్స్ వచ్చేవి కదా? అందులో కొన్ని అంచనాలు, క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఈ ఐడియా రాజ్ గారికి వచ్చింది. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కావడమే మా గోలా, మనల్ని మనలాగా ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేరా? అనే పాయింట్ లోంచి కథ పుట్టింది. సొసైటీ పెట్టిన ఆ బెంచ్ మార్క్‌ని రీచ్ కావడానికే మన ప్రయత్నాలు జరుగుతాయని నందినీ రెడ్డి అన్నారు.

Recommended For You
Peddi 8 days AP TG collections: పెద్ది జోరు కొనసాగుతుందా? తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ పరిస్థితేంటీ?
Peddi 8 days AP TG collections: పెద్ది జోరు కొనసాగుతుందా? తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ పరిస్థితేంటీ?

హీరోలకు భాషా స్టైల్ ఫ్లాష్ ఉంటుంది.. కానీ ఒక అమ్మాయికి కనుక ఇలాంటి స్టోరీ ఉంటే ఎలా ఉంటుందనేది కథ. ఐడియా రాజ్ గారిదే.. దానికి మేమంతా మా వంతు సాయం చేసి స్క్రిప్ట్ రెడీ చేశాం. ఇక ఈ సినిమా ఫైట్స్ గురించి వస్తే.. సమంత గారు ట్రైయిన్డ్ ఫైటర్. ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ కోసం చాలా స్టంట్స్ చేసే ఉన్నారు. నేచురల్‌గానే తన బాడీ లాంగ్వేజ్ మారిపోయేది.. స్టంట్ మాస్టర్ చేస్తున్నప్పుడు ఏ రోజు స్టంట్స్ ఆరోజే ట్రైన్ చేస్తారు. సమంత గారు ఫైట్ చేసే కొన్ని వీడియోలు కూడా బయటపెట్టాం. స్టంట్ మాస్టర్ లీ గారి అసోసియేట్ ఫ్రెడే చీర కట్టుకుని ఎలా ఫైట్ చేయాలో చేసి చూపించారు. ఆయన ఫైట్స్ డిజైన్ చేస్తారు.. ఆ తర్వాత సమంత గారికి ట్రైన్ చేయాలి. ఇలాంటి టైంలో ప్యాంట్ వేసుకుని చేస్తే సమంత గారితో చేయాలంటే కష్టం. అందుకే ఆయన స్వయంగా చీర కట్టుకుని చేశారు. అలా ప్రతీది ప్లానింగ్‌తో చేశాం.. సమంత కూడా వచ్చి నేర్చుకున్నారు. ఈ జర్నీలో సమంత చాలా ఈజీగా ఫటా ఫట్ అన్నట్లుగా కొన్ని స్టంట్స్ చేసుకుంటూ వెళ్లిపోయారు. అది చూసి లీ గారు షాకయ్యారు.. ఏంటీ ఇంత ఫస్ట్‌గా చేస్తుందని. దాంతో ఫైట్స్‌ని కొంచెం కష్టంగా మార్చేశారు అని నందినీ రెడ్డి చెప్పారు.

You May Also Like
కరుప్పు హిట్‌తో పెరిగిన త్రిష డిమాండ్... రెమ్యునరేషన్‌పై షాకిచ్చిన హీరోయిన్
కరుప్పు హిట్‌తో పెరిగిన త్రిష డిమాండ్... రెమ్యునరేషన్‌పై షాకిచ్చిన హీరోయిన్

ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ ఎందుకు రావడం లేదని యాంకర్ అడగ్గా.. డైరెక్షన్‌లో సక్సెస్ అవుతున్న వారు చాలా తక్కువ. అలాంటి కేటగిరీలోకి ఎంట్రీ చూసుకోవాలి. డైరెక్షన్ అనేది చాలా సవాల్ విసిరే పోస్ట్. నేను వచ్చినప్పుడు ఒకరు కూడా లేరు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, అసోసియేటేడ్ డైరెక్టర్స్ కానీ పెరుగుతూ వస్తున్నారు. అంతమంది పెరిగారా అంటే పెరగలేదని చెప్పొచ్చు. ఫిమేల్ టెక్నీషియన్స్, ఎడిటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, డీవోపీలు కూడా పెరుగుతున్నారు. కానీ మగాళ్లతో సమానం అయ్యారా అంటే ఇంకా కాలేదు. నా ఫ్రెండ్స్‌లో ఉన్న డైరెక్టర్స్ కూడా ఫోన్ చేసి ఎవరైనా అమ్మాయి ఉందా అని అడుగుతారు. ఈ మధ్య సెట్స్‌లో అమ్మాయిల్ని ఎక్కువగా చూస్తున్నాను. కానీ ఖచ్చితంగా పెరుగుతారని నందినీ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X